Friday, July 18, 2025

బైక్‌ను తప్పించబోయి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొన్న ఆర్‌టిసి బస్సు

- Advertisement -
- Advertisement -

ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఆర్‌టిసి బస్సు అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్=శ్రీశైలం జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూరు మండలం, జైత్వారం గ్రామానికి చెందిన సంగెం శ్రీశైలం సోమవారం ఉదయం ద్విచక్ర వాహనంపై భార్య, కుమారుడితో కొత్తగూడ నుండి జైత్వారం వైపు యూటర్న్ చేస్తున్నాడు. ఆ సమయంలో కడ్తాల్ నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్‌టిసి సూపర్ లగ్జరీ బస్సు వీరి వాహనాన్ని తప్పించే క్రమంలో కొత్తగూడ చౌరస్తా ఏడమ వైపు

ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ స్థంభాన్ని బలంగా ఢీకొంది. ఈ సంఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న సంగెం శ్రీశైలంతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నగరానికి 108 వాహనంలో తరలించారు. ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొన్న సమయంలో జంపర్ పడిపోవడంతో బస్సులో ఉన్న ప్రయాణికులకు విద్యుత్ షాక్‌కు గురికుండా పెను ప్రమాదం తప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News