Tuesday, July 1, 2025

తగ్గిన జననాల రేటు

- Advertisement -
- Advertisement -

ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడి ప్రతి మహిళకు 1.9
జననాలకు తగ్గుదల రీప్లేస్‌మెంట్ రేటు 2.1కంటే ఇది చాలా
తక్కువ ఈ ఏడాది చివరినాటికి 146కోట్లకు చేరనున్న దేశ జనాభా

న్యూఢిల్లీ:  2025 నాటికి భారత జనాభా 1.46 బిలియన్లకు చేరుతుందని అంచనా. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారతదేశం కొనసాగుతుందని ఐక్యరాజ్యసమితి జనాభా నివేదిక వెల్లడించింది. అయితే భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తిరేటు ప్రామాణిక రేటు కంటే తక్కువగా ఉందని ఈ నివేదిక పేర్కొంది. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్
(యుఎన్‌ఎఫ్ పిఏ) విడుదల చేసిన 2025 ప్రపంచ జనాభా స్థితి నివేదిక లో ద రియల్ ఫెర్టిలిటీ క్రైసిస్ వివరణలో సంతానోత్పత్తి తగ్గడం వల్ల కలిగే భయాందోళనలను విస్మరించి, పునరుత్పత్తి లక్ష్యాలు సాధించడంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చింది.

జనాభా తగ్గడమో, అధిక జనాభాలో నిజమైన సంక్షోభం కాదని పేర్కొన్నారు. నిజమైన లోపం పునరుత్పత్తి యంత్రాంగం లో ఉంది. సెక్స్ పట్ల విముఖత, గర్భనిరోధకం విషయంలో స్పష్టమైన ఆలోచన లేకపోవడం, వివాహం, సంసారం ప్రారంభించడం పై గలస్వేచ్చ వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాల విషయంలో వారి సామర్థ్యాలు పునరుత్పత్తి కి అవరోధంగా పరిణమిస్తున్నాయని నివేదిక పేర్కొంది. జనాభా పెరుగుదల రేటు, సంతానోత్పత్తి, ఆయుర్దాయం, ఎంతకాలం జీవిస్తామనే విషయంలో వచ్చిన కీలకమైన మార్పులను కూడా ఈ నివేదిక సూచిస్తున్నది.

భారతదేశ మొత్తం సంతానోత్పత్తి రేటు ప్రతిమహిళకు 1.9 జననాలకు తగ్గిందని, ఇది భర్తీ స్థాయి రేటు (రీప్లేస్ మెంట్ రేట్)కంటే తక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది. అంటే సగటున భారతీయ మహిళలు ఒక తరం నుంచి, మరో తరానికి అందించే జనాభా సంఖ్యను తగ్గించడానికి మొగ్గు చూపుతున్నారు. అంటే అవసరమైన దానికంటే తక్కువ పిల్లలను
కలిగి ఉన్నారని ఈ నివేదికలో అభిప్రాయపడ్డారు. భారతదేశంలో జననాల రేటు మందగించినప్పటికీ, దేశ యువజనాభా గణనీయంగా ఉంది. 0-14 మధ్య వయస్సు ఉన్నవారు 24 శాతం,10-19 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు 17 శాతం
10-24 ఏళ్ల సంవత్సరాల మధ్య ఉన్న యువత 26 శాతం ఉన్నారు. దేశంలోని 68 శాతం జనాభా పనిచేసే వయస్సు అంటే 15- 64 సంవత్సరాల మధ్య వయస్సు గలవారే. పూర్తి స్థాయిలో ఉపాధి, విధానపరమైన నిర్ణయాలద్వారా మద్దతు లభిస్తే లాభదాయకంగా జనాభాను అందించే సూచనలు ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం భారతదేశ జనాభా ప్రస్తుతం 1,463.90 మిలియన్లుగా ఉంది.

భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం. దాదాపు 15 బిలియన్ల జనాభాతో కొనసాగి, – దాదాపు 40 సంవత్సరాల తర్వాత తగ్గుదల ప్రారంభమయ్యే ముందు ఈ సంఖ్య 17 బిలియన్లకు పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసినట్లు నివేదిక పేర్కొంది. 1960లో భారతదేశ జనాభా 43 కోట్ల 60 లక్షలు. అప్పట్లో సగటున స్త్రీకి దాదాపు ఆరుగురు పిల్లలు ఉన్నారు. అప్పటిలో నలుగురిలో ఒకరి కంటే తక్కువ మంది ఏదో ఒకరకమైన గర్భ నిరోధక పద్ధతులను అనుసరించేవారు.గత కొనని దశాబ్దాలలో మహిళలలో విద్య పెరిగింది.

ఆరోగ్య సంరక్షణ, పునరుత్పత్తి విషయాలలో ఆలోచనా ధోరణి మారింది. దీంతో తన జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాలలో మహిళల మాట చెల్లుబాటు పెరిగింది. ప్రస్తుతం భారతదేశంలో సగటు స్త్రీకి ఇప్పుడు ఇద్దరే పిల్లలు ఉన్నారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం భారతదేశంలో జనాభా వేగవంతంగా పెరగడానికి ప్రధాన కారణం మధ్య ఆదాయ సమూహాలు. దీంతో జనాభా రెట్టింపు సమయం 79 సంవత్సరాలుగా అంచనావేశారు. భారతదేశం సంతానోత్పత్తి రేటు తగ్గించడంలో గణనీయమైన పురోగతి సాధించింది. 1970లో ఓ కుటుంబంలో దాదాపు ఐదుగురు పిల్లలు ఉంటే,ఇప్పుడు ఇద్దరుగా ఉన్నారు. మెరుగైన విద్య, పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణలో సాధించిన పురోభివృద్ధి ఇందుకు కారణమని ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ సంస్థ భారతీయ ప్రతినిధి అండ్రియా ఎం. వోజ్నర్ అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News