Friday, June 20, 2025

రొమాంటిక్‌గా ‘బర్బాద్..’

- Advertisement -
- Advertisement -

యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ మీద మోహిత్ సూరి తెరకెక్కిస్తున్న న్యూ ఏజ్ లవ్ స్టోరీ ‘సయారా’.(Saiyyara)ఈ మూవీతో అహాన్ పాండే తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో అనీత్ పద్దా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ‘సయారా’ టీజర్, టైటిల్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. ఇదొక న్యూ ఏజ్ లవ్ స్టోరీ అని, నే టి ట్రెండ్‌కి, యూత్‌ని అద్దం పట్టేలా ఉందని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. తాజాగా సయారా నుంచి రెండో పాటను రిలీజ్ చేశారు. ‘బర్బాద్’ అంటూ సాగే ఈ పాటను యంగ్ సెన్సేషన్ జుబి న్ ఆలపించారు. ఈ పాటకు ది రిష్ సాహిత్యా న్ని అందించడమే కాకుండా బాణీని సమకూర్చారు. ఇక ఈ రొమాంటిక్ లవ్ సాంగ్ కోసం జుబిన్‌ను ఎంచుకోవ డానికి ప్రత్యేక కారణం ఉందని దర్శకుడు మోహిత్ తెలిపారు.

ఈ మేరకు మోహిత్ మాట్లాడుతూ.. “ప్రేమ పాట ల్ని పాడేందుకు ప్రతీ తరంలో ఓ గాయకుడు పుట్టుకొస్తారు. ఈ తరానికి జుబిన్ అలాంటి ఓ గ్రేట్ సింగర్. సయారా ఆల్బమ్‌లో జుబిన్ ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ ట్రాక్ పాడాలని నేను అనుకున్నాను. నేను బర్బాద్ ట్యూన్ విన్నప్పుడు జుబిన్ గాత్రం సరిగ్గా సరిపోతుందని భావించాను. ఆయన గొంతులో ఇలాంటి రొమాంటిక్ లవ్ సాంగ్స్ (Love Songs) ఇంకా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. సయారా టైటిల్ ట్రాక్‌కి మాకు లభించిన అద్భుతమైన స్పందన తర్వాత మళ్లీ ఇలా ‘బర్బాద్’ను తీసుకు వస్తున్నాం. ఈ పాటకి కూడా ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నాము”అని అన్నారు. ఈ మూవీని జూలై 18న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News