Friday, July 18, 2025

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బిఆర్‌ఎస్ దోపిడీ: మంత్రి పొంగులేటి

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో ప్రజల సొమ్మును దోపిడీ చేసిందని, కమిషన్ రిపోర్టు తదుపరి ఎంతటివారైనా చట్టపరమైన చర్యలు తప్పవని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన అనంతరం జిల్లా కేంద్రంలోని రోడ్లు, భవనాల శాఖ అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సీతక్క తో కలిసి ఆయ మాట్లాడుతూ..గత ప్రభుత్వం అభివృద్ధి అనే ముసుగులో ధనిక రాష్ట్రాన్ని దోచుకునే విషయంలో ప్రధాన ఎజెండా మూడింటిలో టార్గెట్ పెట్టుకుందని ఆరోపించారు. గోదావరి, కృష్ణా నీరు వృధాగా సముద్రంలోకి పోతున్నాయని నీటిని వడేసి పట్టుకుని రాష్ట్రాన్ని సశ్యశ్యామలం చేయాలని దొంగమాటలు చెబుతూ అద్భుతంగా కట్టాలని చెప్పే లక్ష కోట్లపైగా ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామనే వంకతో ఎవరూ ఊహించనంత ప్రజల సొమ్మును దోచుకుందని ఆరోపించారు.

తమ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి కాళేశ్వరం కూలిపోవడానికి కారణాలపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైన ఎన్‌డిఎస్‌సి వంటి సంస్థలతో సర్వే చేయించి లోపాలను గ్రహించి రాష్ట్ర విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్టుతో పాటు రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేసిందని తెలిపారు. ఆ ప్రాజెక్టులో జరిగిన లోపాలను, ప్రాజెక్టు పేరుతో ‘పింక్’ వ్యవస్థను మరింత ఆర్థికంగా బలోపేతం చేయడానికి పన్నిన కుట్రలను ఛేదించడానికి కమిషన్ నియమించామని అన్నారు. అందుంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న అధికారులు, రాజకీయ నాయకులు ఎవరైనా వారిని ఒక్కొక్కరిగా సుదీర్ఘంగా విచారించి అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా కమిషన్ ముందుకు వెళ్లారని అన్నారు. తెలంగాణ జాతిపితగా సర్టిఫికెట్ ఇచ్చుకునే వ్యక్తి ఎవరైనా కానీ కమిషన్ ఇచ్చే రిపోర్టు తరువాత పేదోడి సొమ్మును

కొల్లగొట్టే ఎవరినైనా ఇందిరమ్మ ప్రభుత్వం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడి 18 నెలల తరువాత గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇస్తామన్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ బానోత్ రవి చందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News