Sunday, June 15, 2025

పఠాన్‌కోట్ లో ఆర్మీ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ లో భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. నంగల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాలెడ్ గ్రామంలో శుక్రవారం ఉదయం వాయుసేన హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌ అయ్యిందని.. అయితే, ఎటువంటి ప్రమాదం జరగలేదని ప్రాథమిక నివేదికలు తెలిపాయి. పఠాన్‌కోట్ వైమానిక దళ స్టేషన్ నుండి బయలుదేరిన హెలికాప్టర్ సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసర ల్యాండింగ్ అయినట్లు సమాచారం. ముందు జాగ్రత్తగా ఓ ఖాళీ ప్రదేశంలో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. హెలికాప్టర్ దిగుతున్న దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని గుమిగూడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News