లండన్: ఒక జట్టు కెప్టెన్ అంటే.. అందరి బాధ్యతలను తన భుజంపై వేసుకొని ఆ జట్టును ముందుకు తీసుకువెళ్లాలి. ప్రతీ ఒక్కరి కష్టాలను తన కష్టంగా భావించాలి. అతనికి ఎంతటి ఇబ్బంది కలిగిన జట్టును విజయతీరాలకు చేర్చేందుకు పోరాడాలి. అలాంటి లక్షణాలన్ని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమాలో (Temba Bavuma) పుష్కలంగా కనిపిస్తున్నాయి. డబ్ల్యూటిసి ఫైనల్స్‌తో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాతో సౌతాఫ్రికా తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ వరకూ ఆసీస్ ఆధిపత్యం కనిపించింది. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో అటు బౌలింగ్‌లో ఆసీస్‌ని కట్టడి చేశాడు.
ఆ తర్వాత 282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రోటీస్ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఎయిడెన్ మార్క్‌రమ్‌తో కలిసి బావుమా మంచి భాగస్వామ్యాన్ని జత చేశాడు. బావుమాకి (Temba Bavuma) బ్యాటింగ్ వచ్చిన కొంత సమయానికే లైఫ్ వచ్చింది. అతను ఇచ్చిన ఈజీ క్యాచ్‌ని స్టీవ్ స్మిత్ చేజార్చాడు. ఆ తర్వాత బావుమా ఎడమ కాలి కండరాలు పట్టేశాయి. మైదానంలో ఫిజియో వచ్చి అతనికి వైద్యం కూడా అందించాడు. అందరూ అతను రిటైర్ హర్ట్‌గా వెనుదిరుగుతాడని భావించారు. కానీ, బావుమా పట్టు వదలకుండా బ్యాటింగ్ చేసి ఈ ఇన్నింగ్స్‌లో అర్థశతకం సాధించాడు. మార్క్‌రం కూడా శతకం సాధించడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 213 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు సఫారీలకు మరో 69 పరుగులు కావాలి. అయితే నాలుగో రోజు మ్యాచ్ ప్రారంభమైన కొంత సమయానికే బావుమా ఔట్ అయ్యాడు. కమ్మిన్స్ బౌలింగ్‌లో 66 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్యారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.