Sunday, September 14, 2025

67 అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

మహానగరం దుబయ్‌లో 67 అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున స్థానిక మెరినా ప్రాంతంలోని ఈ బహుళ అంతస్తుల భవనంలోని ఓ ఫ్లోర్‌లో తొలుత మంటలను గుర్తించారు. క్రమేపీ ఇవి అదుపులేకుండా వ్యాపించాయి. దీనితో సహాయక బృందాలు వచ్చి ముందుగా 764 ఫ్లాట్లలోని మొత్తం 3820 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈలోగా అక్కడికి చేరుకున్న అగ్నిమాపక బృందాల వారు గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ప్రమాదంలో ఎవరికి ప్రాణాపాయం జరగలేదు. భారీగానే ఆస్తినష్టం జరిగి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలోని బహుళ అంతస్తుల భవనాన్ని మెరినా పినాకిల్ లేదా టైగర్ టవర్‌గా పిలుస్తారు. ఆకాశం అంటే రీతిలో ఉండే అపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటలు చాలా సేపటివరకూ స్థానికుల్లో భయాందోళనలను కల్గించాయి. అధికార యంత్రాంగం సకాలంలో ముప్పు గుర్తించడం, వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగినందున నివాసితులు అంతా సురక్షితంగా బయటపడ్డారు. ఎటువంటి గాయాలకు గురి కాకుండా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News