- Advertisement -
అహ్మదాబాద్ : గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించారు. జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో విజయ్ రూపానీ మరణించిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన ఘటన ప్రాణాలు కోల్పోయిన 241 మంది ప్రయాణికుల్లో రూపానీ కూడా ఉన్నారు. తాజాగా DNA పరీక్ష ద్వారా రూపానీ మృతదేహాన్ని గుర్తించిన అధికారులు.. ఆయన మరణించినట్లు నిర్ధారించారు. 68 ఏళ్ల విజయ్ రూపానీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆగస్టు 2016 నుండి సెప్టెంబర్ 2021 వరకు పనిచేశారు. కోవిడ్ తర్వాత ఆర్థిక పునరుద్ధరణతో సహా ముఖ్యమైన సమయాల్లో రాష్ట్రాన్ని నడిపించారు. ఆయన మృతిపై స్పందించిన కేంద్ర జలశక్తి మంత్రి, గుజరాత్ బిజెపి అధ్యక్షుడు సిఆర్ పాటిల్ మాట్లాడుతూ.. పార్టీకి, రాష్ట్రానికి తీవ్ర నష్టం అని అన్నారు.
- Advertisement -