దక్షిణ భారతదేశంలో అత్యధిక మార్కులు
670 మార్కులతో ఆలిండియా 18వ ర్యాంకు
తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1
నారాయణలో శిక్షణతో కల సాకారం
‘మన తెలంగాణ’తో కాకార్ల జీవన్ సాయికుమార్
మన తెలంగాణ/హైదరాబాద్ :దేశంలోనే అత్యంత క్లిష్టమైన పోటీ పరీక్ష నీట్ లో(యుజి) తెలుగు రాష్ట్రాల్లో ప్రతిభ చూపిన రాష్ట్రానికి చెందిన కాకర్ల జీవన్ సాయి కుమార్ ఆలిండియా స్థాయిలో 18వ ర్యాంకు సాధించారు. అంతే కాకుండా దక్షిణ భారతంలో 670 మార్కులు సాధించి సంచలనం సృష్టించారు. తానీ లక్షానికి చేరుకోవడానికి ‘నారాయణ’ మార్గదర్శిగా నిలిచిందని జీవన్ సాయికుమార్ కొనియాడారు. కష్టపడి చదివితే సాధించలేనిదంటూ ఏమి లేదని అంటున్న జీవన్ సాయికుమార్ తన మనోగతాన్ని మన తెలంగాణ తో పంచుకున్నారు.
విశ్లేషిస్తూ చదివితే విజయం
ఈ ఏడాది నీట్ పరీక్ష ఎంతో సంక్లిష్టంగా ఉంది. అందులో 720 మార్కులకు 670 మార్కులు అంటే మామూలు విషయం కాదు. మూడు సబ్జెక్టులలనూ అవపోసన పడితే కానీ అది సాధ్యం కాదు. ఎంతో కష్టపడి చదివి 670 మార్కుల మార్కుని అందుకున్న వ్యక్తిగా కాకర్ల జీవన్ సాయికుమార్… నీట్లో ప్రతి ప్రశ్ననూ ఎదుర్కొనేంత విషయ పరిజ్ఞానం రావాలంటున్నాడు. అదే తనకు ఆలిండియా 18వ ర్యాంకు తెచ్చిపెట్టిందంటూ తాను సన్నద్దమైన తీరును వివరించారు.
ప్రశ్న : నీట్ (యుజి)లో ఈ మార్కుల పట్ల స్పందన ఏమిటి..?
జవాబు : నీట్లో ఈస్థాయి మార్కులు రావడానికి చాలా కష్ట పడ్డాను. వైద్య విద్యపై మక్కువతోనే కష్టమైనా ఇష్టంగా చదివాను.
ప్రశ్న : కుటుంబ నేపథ్యం…?
జవాబు : మా స్వగ్రామం దేవరపల్లి మండలం, దుద్దుకూరు. ఉండేది హైదరాబాద్‌లో. నాన్న గంగాధర నాగకుమార్, మల్లా రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ప్రోఫెసర్, అమ్మ నళిని దేవి గృహిణి. నా చదువంతా హైదరాబాద్‌లో జరిగింది. 6వ తరగతి నుంచి నారాయణ సివో పాఠశాల్లో చదివాను. సిబిఎస్ఇలో పదవతరగతిలో 90 శాతం మార్కులు వచ్చాయి. ప్లస్ 2, మాదాపూర్ నారాయణ కాళాశాలలో 98 శాతం మార్కులు వచ్చాయి. నీట్కి శిక్షణ కూడా ఇక్కడే తీసుకున్నాను.
ప్రశ్న : వైద్య రంగం ఎంచుకోవడానికి కారణాలు ఏమిటి ?
జవాబు : చిన్నతనం నుంచి వైద్యరంగమంటే ఇష్టం. అందుకు అనుగుణంగా నా తల్లిదండ్రుల ప్రేరణ. చిన్నతనంలోనే ఈ రంగానికి రావాలన్న ఆలోచనకు బీజం పడింది. బైపిసి తీసుకుని, తరువాత నీట్‌కు సన్నద్దమయ్యాను.
ప్రశ్న : నీట్ కోసం ఏవిధంగా సిద్దమయ్యారు ?
జవాబు : సాధారణ స్టడీస్‌లో నేను సగటు విద్యార్థినే. చిన్నతనం నుంచి వైద్యరంగంలో స్థిరపడాలనే బలమైన కోరికతో నీట్‌పై దృష్టి సారించాను. ఆలిండియా ర్యాంకు కోసం అహర్నిశలు కష్టపడ్డాను. అందుకు తగ్గట్టే ఆలిండియా 18వ ర్యాంకు సాధించాను. వైద్య రంగంపై మక్కువతోనే ఈ విజయం సాధ్యమయింది.
ప్రశ్న : శిక్షణ పరంగా ఎటువంటి సవాళ్లు అధిగమించారు.?
జవాబు : నీట్‌కు సన్నద్దమవ్వాలంటే ఏ విషయమైనా పరీక్షలు, ప్రశ్నలు అనే కోణం కాకుండా పూర్తి అవగాహన వచ్చేలా విశ్లేషిస్తూ చదవాలి. నారాయణ కళాశాల గైడెన్స్‌తోనే పరీక్షలకు సన్నద్దమయ్యే సందర్భంలో ఎదురైన సవాళ్లను అధిగమించగలిగాను.
ప్రశ్న : నారాయణ కళాశాలలో ఎటువంటి కోచింగ్ ఉండేది?
జవాబు : నారాయణ శిక్షణతోనే ఈ స్థాయి ర్యాంకు సాధ్యమయింది. కోచింగ్ సమయంలో ప్రతి అంశాన్ని విశ్లేషించి అవగాహనతో ముందుకు తీసుకుపోయే ప్రణాళిక ఉండాలి. ప్రతి అంశంపై పూర్తి అవగాహనతో ముందుకు వెళితేనే ఆత్మ విశ్వాసం బలపడుతుంది. దీనికి నారాయణ పరీక్షా విధానం మార్కుల విశ్లేషణ, సందేహాల నివృత్తి, మైక్రోషెడ్యూల్, ఎర్రర్ లిస్ట్, రివిజన్ ప్రోగ్రామ్ ఎంతగానో ఉపయోగపడింది.