Friday, June 20, 2025

గద్దర్ అవార్డుల వేడుక సక్సెస్ కావడం సంతోషాన్నిచ్చింది

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం శనివారం హైటెక్స్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు కృతజ్ఞతలు తెలియజేయగానికి ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, ఎఫ్‌డీసీ ఎండి హరీశ్ ఐఏఎస్‌లు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎఫ్‌డీసీ ఎండీ హరీశ్ మాట్లాడుతూ.. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటి రెడ్డి వెంకటరెడ్డి సూచనలతో, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు సూపర్ విజన్‌లో సక్సెస్‌ఫుల్‌గా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేడుకను నిర్వహించుకున్నాం. అవార్డ్ వేడుక సక్సెస్‌కు కారణమైన ప్రతి ఒక్కరికి, సినీ అభిమానులకు, సినీ పరిశ్రమకు నా కృతజ్ఞతలు’ అని తెలిపారు. దిల్ రాజు మాట్లాడుతూ.. “తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల వేడుకను బిగ్ ఈవెంట్‌గా నిర్వహించి సక్సెస్ చేశాం.

ఆరు నెలల కృషితో ఈవెంట్‌ను సక్సెస్‌ఫుల్‌ (Make event success hard work) గా నిర్వహించాం. తెలంగాణ ఆవిర్భావం నుంచి అవార్డులను ఇవ్వాలని అనుకుని 2014 నుంచి 2023 వరకు ఎంపికైన ఉత్తమ చిత్రాలకు, 2024లో ఉత్తమ నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులకు అవార్డులు అందజేశాం. పారదర్శకంగా సినిమాలను, టెక్నిషియన్స్‌ను అవార్డులకు ఎంపిక చేశాం. ఈ అవార్డుల వేడుకను బాధ్యతగా తీసుకున్నాం. అవార్డు ఫంక్షన్ జరిగిన విధానంపై మంచి ఫీడ్‌బ్యాక్ వస్తోంది. అందరూ ప్రశంసిస్తున్నారు. సినిమా పరిశ్రమలోని అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్లందరికి ఎఫ్‌డీసీ తరపున నా ధన్యవాదాలు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉప ముఖ్యమంతి భట్టి విక్రమార్కకి నా థ్యాంక్స్.

ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నా ప్రత్యేక ధన్యవాదాలు. సిఎం ఈ వేడుక కోసం రెండున్నర గంటలు కేటాయించారు. మొదట్లో గంట అనుకున్నారు. అయితే నా కోరిక ప్రకారం రెండున్నర గంటలకు పైగా ఉండి, అందరికి అవార్డులు అందజేశారు. సిఎం చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం అందరికి ఎంతో సంతోషాన్నిచ్చింది. ప్రభుత్వం నుంచి అవార్డులు వస్తున్నాయంటే సినిమా పరిశ్రమలోని అందరూ బాధ్యతగా స్వీకరించాలి. షూటింగ్‌లతో బిజీగా ఉన్నా, ఎక్కడా ఉన్నా ప్రభుత్వం నుంచి అవార్డు వచ్చిందంటే ఆ వేడుకకు వచ్చి అవార్డ్ తీసుకోవాలి. భవిష్యత్‌లో ఎప్పుడైనా ప్రభుత్వం నుంచి అవార్డ్ వస్తే స్వీకరించాలి. ఇక ఇంత పెద్ద వేడుకలో చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఏమైనా తప్పులు జరిగి ఉంటే, బాధపడి ఉంటే వాళ్లకు ఎఫ్‌డీసీ తరఫున నేను క్షమాపణలు కోరుతున్నాను’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News