Wednesday, September 17, 2025

టీమిండియా హెడ్ కోచ్‌గా లక్ష్మణ్!

- Advertisement -
- Advertisement -

లండన్: మరో నాలుగు రోజుల్లో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. అయితేటీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసుకునేందుకు ఇంగ్లండ్ నుంచి ఇండియాకు వచ్చాడు. దీంతో టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు సన్నాహాలను టీమిండియా మాజీ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షించనున్నారు. గంభీర్ స్థానంలో వివిఎస్ లక్ష్మణ్ ఈ బాధ్యతను నిర్వర్తించనున్నారు. నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సిఎ) (National Cricket Academy) అధ్యక్షడైన లక్ష్మణ్ అండర్-19 జట్టు ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా లండన్‌లోనే ఉన్నారు. దాంతో లక్ష్మణ్‌కు ఈ బాధ్యతలు ఒప్పజెప్పినట్టు తెలుస్తోంది. కాగా, భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. మొదటి టెస్టు జూన్ 20 నుంచి ప్రారంభంకానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News