Tuesday, June 17, 2025

రెబల్ వైబ్ స్టార్ట్.. ‘రాజాసాబ్’ టీజర్ వచ్చేసింది

- Advertisement -
- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి నటిస్తున్న రొమాంటిక్ హర్రర్ కామెడీ సినిమా ‘రాజాసాబ్‘. డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. కొద్దిసేపటిక్రితమే ఈ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి తోపాటు మేకర్స్ ప్రసాద్ ఐమాక్స్ వద్ద సందడి చేశారు. థియేటర్ వద్ద ప్రభాస్ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ఈ టీజర్ చూసేందుకు భారీగా అభిమానులు ఐమాక్స్ వద్దకు చేరుకున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. తొలిసారి ప్రభాస్.. హారర్ కామెడీ చేస్తుండటంతో ఫ్యాన్స్ తోపాటు సనీ ప్రేక్షకులు ‘రాజాసాబ్’పై ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News