Tuesday, June 17, 2025

త్వరలో హీరో, టీవీఎస్, ట్రయంఫ్ నుండి 500 సిసి బైక్స్..

- Advertisement -
- Advertisement -

ఇండియన్ మార్కెట్లో భారీ ఇంజిన్ బైక్‌ల ప్రదర్శన జరగబోతోంది. ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లో అనేక కొత్త మోడళ్లను చూడొచ్చు. టీవీఎస్, హీరో, ట్రయంఫ్ వంటి ప్రధాన ద్విచక్ర వాహన బ్రాండ్‌లు దేశీయ మార్కెట్లో కొత్త మోడళ్లను విడుదల చేయనున్నాయి. బ్రాండ్‌లు భారీ ఇంజిన్ బైక్‌లను కోరుకునే వారిని, యువతను లక్ష్యంగా చేసుకొని బైక్ కంపెనీలు బైక్స్ ని మార్కెట్లోకి తీసుకురానున్నాయి. ఇప్పుడు భారత మార్కెట్లో విడుదల కానున్న 500 సిసి కంటే తక్కువ సామర్థ్యం గల బైక్‌ల గురించి తెలుసుకుందాం.

హీరో ఎక్స్‌పల్స్ 421

హీరో మోటోకార్ప్ తన కొత్త బైక్ ఎక్స్‌పల్స్ 421 ను త్వరలో మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇది కంపెనీకి అతిపెద్ద అడ్వెంచర్ బైక్. ఈ బైక్ ఇటలీలోని మిలన్‌లో జరగనున్న EICMA 2025లో ప్రదర్శించనున్నారు. ట్రేల్లిస్ ఫ్రేమ్‌పై నిర్మించబడిన Xpulse 421 ప్రీలోడ్ సర్దుబాటు, మోనోషాక్ వెనుక సస్పెన్షన్‌తో USD ఫ్రంట్ ఫోర్క్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ కొత్త ఎక్స్‌పల్స్ 421 కెటిఎమ్390 అడ్వెంచర్, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450, టీవీఎస్ అపాచీ ఆర్‌టిఎక్స్300 వంటి బైక్‌లతో నేరుగా పోటీ పడనుంది.

ట్రయంఫ్ త్రక్స్టన్ 400

ట్రయంఫ్ త్రక్స్టన్ 400తో భారత మార్కెట్లో తన 400cc బైక్‌ల శ్రేణిని విస్తరించనుంది. కంపెనీ ప్రస్తుతం భారతదేశంలో స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400X, స్క్రాంబ్లర్ 400 XC, స్పీడ్ T4లను విక్రయిస్తోంది. థ్రక్స్టన్ 400, కేఫ్-రేసర్ మోడల్ అయినప్పటికీ దాని స్టైలింగ్ స్పీడ్ ట్రిపుల్ 1200 RR నుండి తీసుకోబడింది. ఈ బైక్ స్పీడ్ 400 అనేక సైకిల్ భాగాలను పంచుకుంటుందని భావిస్తున్నారు. స్పీడ్ 400 నుండి దీనిని వేరు చేయడానికి కొన్ని విలక్షణమైన అంశాలు క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్లు, బార్ ఎండ్ మిర్రర్లు, సింగిల్-పీస్ సీటు, స్కల్ప్టెడ్ ఇంధన ట్యాంక్ రూపంలో ఉంటాయి. ఈ ఏడాది చివర్లో ఈ బైక్ రిలీజ్ కానున్నది.

టీవీఎస్ అపాచీ 450

టీవీఎస్, బిఎండబ్ల్యూ 450 ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడిన 450cc వెర్షన్ అపాచీ RTR పై పనిచేస్తోంది. నివేదికల ప్రకారం.. రాబోయే టీవీఎస్ అపాచీ 450 పూర్తిగా ఫెయిర్డ్ సూపర్‌స్పోర్ట్ బైక్ అవుతుంది. TVS-BMW భాగస్వామ్యం ఇప్పటికే RR310, RTR 310 లతో పాటు అనేక 300cc మోడళ్లను ఉత్పత్తి చేసింది. డిజైన్, ఫీచర్ల పరంగా కొత్త మోడల్ అధునాతనంగా ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News