పోలీసు అధికారులు హర్యానాలోని సోనీపత్‌లో ఓ కాలువ నుంచి శీతల్ అనే మోడల్ భౌతిక కాయాన్ని సోమవారం వెలికి తీశారు. ఆమె హర్యాన్వీ మ్యూజిక్ ఇండస్ట్రీలో పనిచేసేది. ఆమె హత్య వెనుక కారణాలు తెలియరాలేదు. కాగా హంతకుల కోసం పోలీసులు వేట మొదలెట్టారు. ఆమె సోదరి నేహా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం తన సోదరి శీతల్ షూట్ కోసం అహర్ గ్రామానికి వెళ్లింది. అక్కడి నుంచి శీతల్ కాల్చేసి తన మాజీ బాయ్‌ఫ్రెండ్ సునీల్ తనని తిడుతున్నాడని, శారీరకంగా హింసిస్తున్నాడని,
అంతేకాక తనని బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడని తెలిపినట్లు పేర్కొంది. ఆ తరువాత తన సోదరి ఇంటికి రాకపోయేసరికి నేహా ఓల్డ్ ఇండస్ట్రీయల్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ పర్సన్స్ కాంప్లెయింట్ దాఖలు చేసింది. ఆ తరువాత పోలీసులు దర్యాప్తు మొదలెట్టి ఖంద గ్రామం వద్ద కాలువలో ఆమె మృత దేహాన్ని కనుగొని, వెలికి తీశారు. సునీల్ ఓ హోటల్లో శీతల్‌తో స్నేహం చేశాడని, పెళ్లి చేసుకోమని కోరాడని.. అయితే అతడికి అప్పటికే పెళ్లయిందన్న సంగతి శీతల్‌కు తెలిసిందని ఆమె సోదరి వివరించింది.