- Advertisement -
బెంగళూరు: ర్యాపిడో డ్రైవర్ కొట్టాడని ఓ యువతి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరు రాజధాని జయనగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ యువతి ర్యాపిడ్ బైక్‌ను బుక్ చేసుకుంది. ర్యాపిడో డ్రైవర్ నిర్లక్షంగా బైక్ నడపడంతో అతడితో ఆమె వాగ్వాదానికి దిగింది. గమ్యస్థానం చేరుకున్న తరువాత ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. డబ్బులు, హెల్మెట్ ఇచ్చేందుకు ఆమె నిరాకరించడంతో ఆమెపై అతడు దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
- Advertisement -