హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha).. తాజాగా నిర్మాతగా కూడా మారిపోయారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆమె ‘శుభం’అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సమంత (Samantha )ఫిట్‌నెస్ ఫ్రీక్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆమె తన బాడీ ఫిట్‌గా ఉంచుకొనేందుకు జిమ్‌లో కష్టపడుతారు. తాజాగా ముంబైలో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. బాంద్రాలోని ఓ జిమ్ నుంచి ఆమె బయటకు రాగానే ఆమెను ఫోటోలు తీసేందుకు ఒక్కసారిగా చుట్టుముట్టారు. దీంతో ఆమె ఇబ్బంది పడ్డారు. ‘అరే రుకోజీ ప్లీజ్’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. సమంత కారు రావడం ఆలస్యం కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కారు వచ్చిన వెంటనే ఆమె అందులో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కాగా, గతేడాది సిటాడెల్ : హనీ బన్నీలో వరుణ్ ధవన్‌తో కలిసి చివరిసారిగా తెరపై కనిపించారు సమంత. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు తెరకెక్కిస్తున్న ‘రక్త్ బ్రహాండ్ : ది బ్లడీ కింగ్‌డమ్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. అయితే రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇప్పటివరకూ ఇద్దరు స్పందించలేదు.