ఖమేనీ ఎక్కడ నక్కాడో మాకు
తెలుసు ప్రస్తుతానికి ఆయనను
చంపాలనుకోవడం లేదు
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు
ట్రంప్ హెచ్చరిక మరింత
తీవ్రమైన ఇరాన్ఇజ్రాయెల్
యుద్ధం ఇజ్రాయెల్ దాడిలో
ఖమేనీ సన్నిహితుడు అలీషన్మాదీ
హతం ఇజ్రాయెల్ గూఢచార
విభాగం మొస్సాద్ కేంద్ర
కార్యాలయంపై ఇరాన్ క్షిపణుల
వర్షం డ్రోన్ల తయారీ కేంద్రానికి
భారీ నష్టం రెండు ఇరాన్
ఎఫ్14 యుద్ధవిమానాలు భస్మీ
పటలం పలు దేశాల గగనతలాలు
మూసివేత ఎయిర్‌పోర్టుల్లో
వేలాదిమంది పడిగాపులు
యుద్ధం ముగియాలి : జి7
ఢిల్లీలోని తెలంగాణ భవన్లో
ప్రత్యేక హెల్ప్‌లైన్
ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో మాకు తెలుసు
ప్రస్తుతానికి ఆయనను అంతం చేయాలనుకోవడం లేదు
సోషల్ మీడియా పోస్టులో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అల్ ఖమేనీ రహస్య ప్రదేశంలో దాక్కున్నట్లు వార్తల వచ్చిన విషయం తెలిసిందే. ఖమేనీ మట్టుబెడితే తప్ప తమ రెండు దేశాల మధ్య యుద్ధం ఆగదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైతం తాజాగా ప్రకటించడం విదతమే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఖమేనీ ఎక్కడ దాగి ఉన్నాడో అమెరికాకు తెలుసు. అయితే ప్రస్తుతానికయితే ఆయనను హతమార్చాలని అనుకోవడం లేదు. ఆయన ఓ ఈజీ టార్గెట్ , ప్రస్తుతానికయితే అక్కడ సురక్షితంగా ఉన్నారు’ అని అన్నారు. ‘అయితే క్షిపణులు సామాన్య పౌరులను బలి తీసుకోవడాన్ని సైతం మేము కోరుకోవడం లేదు. మా ఓపిక తగ్గిపోతోంది. మీరు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకువచ్చినందుకు థ్యాంక్స్’ అని అన్నారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ మీడియా మంగళవారం ఓ పోస్టును ఉంచారు. అంతేకాదు ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.