రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ-నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా మరోసారి మీడియాకు దొరికిపోయారు. దీంతో వీరిద్దరూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. బుధవారం ఉదయం రష్మిక, విజయ్ కలిసి ముంబై విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి… ఒకే కారులో వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోతోపాటు ఇద్దరూ కారు వెనుక సీటులో కలిసి కూర్చున్న ఫోటో కూడా వైరల్ గా మారింది. దీంతో మారోసారి రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ప్రేమాయణంపై వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఇటీవలి విహారయాత్రకు వెళ్లిన వీరు.. విడివిగా ఫోటోలు బయటకు వచ్చినా.. సేమ్ ప్లేస్ కావడం ఊహాగానాలకు ఆజ్యం పోసింది. తాజాగా ఒకే కారులో కనిపించడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ అభిమానులు, నెటిజన్లు క్లారిటీకి వచ్చేశారు. గతంలోనూ పలు సందర్భాల్లో వీరి దిగిన ఫోటోలు.. ఇద్దరూ ఒకే చోట హాలిడే ట్రిప్ కు వెళ్లినట్లు చూపించాయి. అప్పటి నుంచి వీరు ప్రేమలో ఉన్నారంటూ రూమార్స్ పుట్టుకొచ్చాయి. కాగా, విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ మూవీతో బిజీగా ఉండగా.. రష్మిక కుబేర మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. మరో సినిమా గర్ల్ ఫ్రెండ్ షూటింగ్ దశలో ఉంది.