Thursday, September 18, 2025

బేగంపేట ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. బుధవారం ఉదయం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో అప్రమత్తమైన బేగంపేట పోలీసులు, భద్రతా దళాలు హై-అలర్ట్ ఆపరేషన్ ప్రారంభించాయి. వెంటనే బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌ను మోహరించి విమానాశ్రయం, సమీప ప్రాంతాలలో అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. బేగంపేట డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ACP) ఇవాళ తెల్లవారుజామున బెదిరింపు వచ్చినట్లు ధృవీకరించారు. “ఈ ఉదయం బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. బాంబు స్క్వాడ్ సహాయంతో సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది” అని ఆయన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News