Thursday, July 31, 2025

బైబిల్ మీద ఒట్టు ట్యాపింగ్ పచ్చినిజం

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో తనను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకు ఫోన్ ట్యాపింగ్ జగన్, కేసీఆర్ ఇద్దరు కలిసి ఫోన్ ట్యాపింగ్ స్కెచ్ వేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. బైబిల్ మీద ప్రమాణం చేసి చెబుతున్నానని, ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం అని, తన ఫోన్, తన భర్త, కుటుంబ సభ్యులను ట్యాపింగ్ చేశారని షర్మిల తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో దర్యాప్తు ముమ్మరం చేయాలని షర్మిల కోరారు. రెండు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలని షర్మిల కోరారు.

అనాడు జగన్, కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నబోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు వైవీ సుబ్బారెడ్డే స్వయంగా చెప్పారని, ఆనాడు ట్యాపింగ్ జరిగిన ఓ ఆడియోను తనకు వినిపించారన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మన్నా వస్తానని షర్మిల స్పష్టం చేశారు. జగన్ తన సొంత మేనల్లుడు, మేన కోడలు ఆస్తి కాజేసే అంశంలో సుబ్బారెడ్డితో అబద్ధాలు చెప్పించారని షర్మిల ఆరోపించారు. ఇలాంటి పరిస్థితిలో వై.వీ సుబ్బారెడ్డి ఒప్పుకుంటాడు అనుకోను..ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికైనా వస్తా..ఏ విచారణను అయినా ఎదుర్కొంటానని వైఎస్ షర్మిల అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News