Friday, June 20, 2025

‘కుబేర’ కథ, క్యారెక్టర్స్, స్క్రీన్‌ప్లే అన్నీ డిఫరెంట్‌గా ఉంటయ్…

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న కాంబినేషన్‌లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హైలీ పాన్-ఇండియా మూవీ కుబేర. అద్భుతమైన తారాగణంతో కుబేర ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎస్‌విసిఎల్‌ఎల్‌పిపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్‌తో నిర్మించారు. కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా కింగ్ నాగార్జున మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
స్టార్స్ కలిసి పనిచేయాలి…
మంచి కథలు రావాలంటే స్టార్స్ కలిసి పనిచేయాలి. ఇంతకుముందు కూడా నేను చాలా సినిమాలు చేశాను. నాన్నగారు(ఏఎన్‌ఆర్) ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు.. ఇలా అంతమంది కలిసి ఎన్నో సినిమాలు చేశారు.
సామాజిక సంబంధిత పాయింట్…
శేఖర్ కమ్ములతో వర్క్ చేయాలని ఎప్పటినుంచో ఉండేది. ఆనంద్ దగ్గర నుంచి ఆయన సినిమాలు గురించి మనందరికీ తెలుసు. ఆయన సినిమాలు నాకు బాగా ఇష్టం. ఆయన కథల్లో సామాజిక సంబంధిత పాయింట్ ఉంటుంది. మిగతావన్నీ కూడా కమర్షియల్ గానే ఉంటాయి. అద్భుతమైన పాటలు ఉంటాయి.
మంచోళ్ళు, చెడ్డోళ్ళు ఉన్నారు…
కుబేరలో చాలా మంచి యూనిక్ పాయింట్ ఉంది. -ఈ సినిమాల్లో మంచోళ్ళు ఉన్నారు. చెడ్డోళ్ళు ఉన్నారు. అల్ట్రారిచ్, మిడిల్ క్లాస్, పేదవాళ్లు… ఇలా మూడు వర్గాల మధ్య సంఘర్షణ ఈ సినిమాలో ఉంటుంది.
సిబిఐ ఆఫీసర్‌గా కనిపిస్తా…
సినిమాలో నాది మిడిల్ క్లాస్ క్యారెక్టర్. సిబిఐ ఆఫీసర్ క్యారెక్టర్‌లో కనిపిస్తాను. మంచి చేయాలా? చెడు చేయాలా? అనే సంఘర్షణ మధ్య ఆ క్యారెక్టర్ ఉంటుంది. నా క్యారెక్టర్స్‌లో చాలా షేడ్స్ వుంటాయి. శేఖర్ నా క్యారెక్టర్‌ని చాలా అద్భుతంగా రాశారు. -ధనుష్ తన పాత్రలో ఒదిగిపోయాడు. అద్భుతంగా నటించాడు.
రియల్ లొకేషన్స్‌లోనే…
సినిమాని దాదాపుగా రియల్ లొకేషన్స్‌లోనే షూట్ చేశాం. తిరుపతి, ముంబయ్, గోవా, బ్యాంకాక్ ఇలా అన్ని బిగ్ రియల్ లొకేషన్స్‌లో వర్క్ చేశాం. ఈ సినిమా కథ డిఫరెంట్‌గా ఉంటుంది.
నువ్వే స్టార్ అని చెప్పా…
రష్మిక మందన్న క్యారెక్టర్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. తను చాలా అద్భుతంగా చేసింది. సినిమా చూసి నువ్వే స్టార్ అని చెప్పాను.
అద్భుతమైన క్వాలిటీతో…
సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఒక పెద్ద సినిమా చేయాలనుకున్నారు. తెలుగు, తమిళ్.. పాన్ ఇండియా స్థాయిలో ఈ ప్రాజెక్టుని చేయడం జరిగింది. చాలా పాషన్‌తో సినిమా తీశారు. డైరెక్టర్ శేఖర్ కమ్ములకి కావాల్సినది ఎక్కడా రాజీపడకుండా ఇచ్చారు. సినిమా చాలా అద్భుతమైన క్వాలిటీతో వచ్చింది.
వండర్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు…
ఈ సినిమాకి మ్యూజిక్ చాలా ముఖ్యం. పాటలు సందర్భానుసారంగా వస్తాయి. దేవి వండర్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు.
కూలీలో డిఫరెంట్ క్యారెక్టర్…
కూలీ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. లోకేష్ కనకరాజ్ పూర్తిగా న్యూ ఏజ్ డైరెక్టర్. క్యారెక్టర్ చాలా కొత్తగా వుంటుంది. ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్ చేశాను.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News