Saturday, June 21, 2025

సిద్ధిపేటలో స్కిల్ సెంటర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : జిల్లాలో అ డ్వాన్స్‌డ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. కార్మిక శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని కొండా భూదేవి ఫం క్షన్ హాల్‌లో శుక్రవారం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలను ఆయన పం పిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ..కాంగ్రెస్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్ర స్తుతం సైతం ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ని ర్మించుకోవడానికి ఐదు లక్షలు దళితులకు రూ. 6 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని అన్నా రు. ఇం డ్లు మంజూరు కాని వారెవరూ అధైర్యపడవద్దని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. సిద్దిపేట జిల్లాకు 12,600 ఇం డ్లు మంజూరైతే ఈ నియోజకవర్గానికి 3,500 ఇం డ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు ఉ చితంగా ఇసుకను సరఫరా చేస్తామని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని సిఎం రేవంత్ రెడ్డి దశలవారీగా అమలు చేస్తున్నారని అన్నా రు.

తెలంగాణ కు 8 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటి కీ రాష్ట్ర అభివృద్ధితో పాటు పేద ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలను నిరంతరం కొనసాగిస్తున్నామని అన్నా రు. రేషన్ షాపుల ద్వారా పేదలకు సన్నబియ్యా న్ని అందిస్తున్నామన్నారు. రూ.23 వేల కోట్లతో రైతు రుణమాఫీని చేశామన్నారు. రైతు భరోసా పేరిట ప్రతి ఎకరాకు రూ.6 వేలు అందిస్తున్నామని అన్నారు. వారం రోజుల్లోపు రైతులందరికీ రైతు భరోసా డబ్బులు వారి అకౌంట్లో జమ అవుతాయని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయదని కొంతమంది అపోహలు సృష్టించారన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి కాంగ్రెస్ పనితీరుకు నిదర్శనమన్నారు. జిల్లా అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేస్తామని అన్నారు. అంతకుముందు బిఆర్‌ఎస్ కౌన్సిలర్లు తమను స్టేజి మీదకు ఆహ్వానించలేదని కొద్దిసేపు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వెంటనే వారిని స్టేజిపైకి ఆహ్వానించగా మంత్రి వివేక్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమవతి, అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్, ఆర్‌డిఒ సదానందం, ఎంఆర్‌ఒ హరికిరణ్, ఆయా పార్టీల నాయకులు కడవెరుగు మంజుల రాజనర్సు, జంగిటి కనకరాజు, గంప మహేందర్, పూజల హరికృష్ణ, ఇమామ్ అతు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News