Saturday, June 21, 2025

అందుకే కౌశిక్ రెడ్డి అరెస్టు… ఖండించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కౌశిక్ రెడ్డి అరెస్టును ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్రమాలు, మంత్రుల అవినీతిపై కౌశిక్ రెడ్డి ప్రశ్నించడంతో ఆయనను అరెస్టు చేశారని దుయ్యబట్టారు. సిఎం రేవంత్ రెడ్డి నిరంకుశ వైఖరి మంచిది కాదని హితువు పలికారు. తప్పుడు కేసులతో బిఆర్‌ఎస్ నేతల మనోధైర్యం దెబ్బతీయలేరని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇలాంటి దారుణాలకు పాల్పడుతోందని కెటిఆర్ విమర్శలు గుప్పించారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా కోర్టుల్లో నిలబడే అవకాశం లేదన్నారు. బిఆర్‌ఎస్ నేతలపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా కూడా ప్రజల తరపున పోరాటం చేస్తామని కెటిఆర్ స్పష్టం చేశారు. ఎంఎల్‌ఎ కౌశిక్ రెడ్డిని విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. రేవంత్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. గ్రానైట్ వ్యాపారి మనోజ్ రెడ్డిని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని బెదిరించడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News