Monday, July 7, 2025

మేకిన్ ఇండియాతో అతుకులు మాత్రమే మిగులుతున్నాయి: రాహుల్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ప్రస్తుతం పరిస్థితుల్లో తయారీ రంగంలో పెను సంస్కరణలు తీసుకరావాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారని పిఎం నరేంద్ర మోడీని ప్రశ్నించారు. ఢిల్లీలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ నెహ్రూ ప్లేస్‌లో రాహుల్ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న టెక్నీషియన్లతో రాహుల్ ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. భారత్‌లో తయారు చేసి ఇక్కడే అమ్మితే బాగుంటుందని, చైనా లాంటి దేశాలకు మనం మార్కెట్ కాకూడదని హెచ్చరించారు.

2014 నుంచి ఇప్పటి వరకు తయారీ రంగంలో భారత్ ఆర్థిక వ్యవస్థ 14 శాతానికి పడిపోయిందని విమర్శలు గుప్పించారు. మేకిన్ ఇండియా అని నినాదాలు చెప్పడంలో పిఎం మోడీ మాస్టర్ చేశారని, ఆచరించడంలో శూన్యం అని ధజమెత్తారు. మేకిన్ ఇండియా పూర్తిగా విఫలం కావడంతో మన అతుకులు మిగులుతున్నాయని ఎద్దేవా చేశారు. మనం ఇతర దేశాల వస్తువులను దిగుమతి చేసుకుంటున్నామని, కానీ తయారు చేయడంలేదన్నారు. దీంతో ఎక్కువగా చైనా లాభ పడుతోందని మండిపడ్డారు. భారత్‌లో తయారీ రంగం పడిపోవడంతో నిరుద్యోగం భారీగా పెరిగిందన్నారు. చైనా నుంచి దిగుమతులు రెండు రెట్లు ఎందుకు పెరిగాయని మోడీని రాహుల్ నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News