Sunday, June 22, 2025

వార ఫలాలు (22-06-2025 నుండి 28-06-2025 వరకు)

- Advertisement -
- Advertisement -

మేషం:   మేష రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. రావలసిన ధనం చేతికి అందుతుంది. మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తి విలువ పెరుగుతుంది. ఏదైనా అత్యవసరమైతేనే స్థిరాస్తిని అమ్మాలనే ఆలోచన చేస్తారు. క్రెడిట్ కార్డులకి మధ్యవర్తి సంతకాలకు లోన్లకు దూరంగా ఉండటం అనేది చెప్పదగిన విషయం. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం అనేది చెప్పదగిన విషయం. అవసరమైతేనే తప్ప దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది. మీ వాక్చాతుర్యంతో నలుగురిని మెప్పించ గలుగుతారు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాబిస్తాయి. ఫ్యాషన్ డిజైనింగ్ సినిమా రంగంలో ఉన్నవారికి హోటల్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అత్యవసరమైతేనే ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ప్రతిరోజు కూడా అష్టమూలికా తైలంతో ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు తెలుపు.

వృషభం: వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. కొన్ని అనాలోచితమైన నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది. సంతానపరంగా బాగుంటుంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఎప్పటినుండో వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం ఒక మంచి సంబంధం కుదురుతుంది. వ్యాపారంలో రొటేషన్స్ తక్కువగా ఉంటాయి. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని కొనసాగించడం మంచిది. విద్యార్థిని విద్యార్థులు చదువును అశ్రద్ధ చేయకండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. బంధువులతో కానీ కార్యాలయంలో కానీ మాట పట్టింపులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. ఆరోగ్యపరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఉంటాయి. మీ ఆలోచన విధానం పలు విధాలుగా ఉంటుంది. ప్రతిరోజు కూడా గురు గ్రహ స్తోత్రాన్ని చదవండి దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు.

మిథునం:  మిధున రాశి వారికి  ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా చెప్పుకోదగిన స్థాయిలో మార్పులు ఏమీ ఉండవు. వ్యాపారం నత్త నడకన సాగుతుంది. పొదుపు చేయడంలో విఫలమవుతారు. ఎంతోకాలంగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి. వైద్య వృత్తిలో ఉన్నవారు ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. విదేశీ వ్యవహారాలు సానుకూలపడతాయి. స్కిన్ కు సంబంధించి జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెడతాయి. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతిరోజు కూడా జిల్లేడు వత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. సుబ్రహ్మణ్య పాశుపాత రూపుని మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు గ్రీన్.

కర్కాటకం :  కర్కాటక రాశి వారికి  ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయటా చెప్పుకో తగిన స్థాయిలో ఇబ్బందులు ఏర్పడతాయి. కెరియర్ పరంగా వ్యాపార పరంగా ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. భూ సంబంధిత వివాదాలు తీరుతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థిని విద్యార్థులకు విద్యా అవకాశాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ సంబంధమైన లీజులు కాంట్రాక్టలు  లభిస్తాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కలిసి వస్తాయి. వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వీసా లభిస్తుంది.  కీలక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. చెయ్యని పనికి సన్నిహితుల నుండి నిందలు ఎదుర్కొంటారు. వివాహ సంబంధం కుదిరిన తర్వాత జాతక పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళండి. ప్రతిరోజు కూడా అష్టమూలికా తైలంతో ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు ఎల్లో.

సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు ఏ పని చేసినా వెనక్కి వెళ్లడం, జీవిత భాగస్వామితో విభేదాలు రావడం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి. వృధా ఖర్చులు చేస్తారు. నూతన వ్యాపారాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు వహించాలి. షేర్ మార్కెట్ కి దూరంగా ఉండాలి ఉద్యోగ పరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఉంటాయి. శనీశ్వరుడికి అవి తైలాభిషేకం చేయించండి సుబ్రమణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అష్టమ శని కారణంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. మీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకోండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు.

కన్య:    కన్యా రాశి వారికి  ఈ వారం సానుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుందని చెప్పవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్లి చదువుకోవాలని అనుకునే విద్యార్థిని విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. నూతన వాహనం కొనుగోలు చేస్తారో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి. ద్వితీయ వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది సంతానం అభివృద్ధిలోకి వస్తారు. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి సుబ్రమణ్య స్వామి వారికి అభిషేకం చేయించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య అయిదు కలిసి వచ్చే రంగు ఎరుపు.

తుల:  తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం యొక్క అభివృద్ధి బాగుంటుంది వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. వ్యాపార విస్తరణ చేయాలని మీ ఆలోచన నెరవేరుతుంది. సంతానానికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్య పరంగా ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్లు గానీ వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు మీకు ఎంతగానో లభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. చేపట్టిన పనులలో ప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగుల విషయంలో  అధికారుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. ఒక మంచి అవకాశం చేతి వరకు వచ్చి చేజారి పోయే పరిస్థితి గోచరిస్తుంది జాగ్రత్త వహించండి. పర్సనల్ లోన్ క్రెడిట్ కార్డు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.  సోదరులతో వివాదాలు పెరుగుతాయి. రాజకీయరంగంలో ఉన్నవారికి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అనుకోని పదవి లభిస్తుంది. ప్రతిరోజు కూడా ఎరుపు  వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి  వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు గ్రీన్.

వృశ్చికం:  వృశ్చిక రాశి వారికి ఈ  వారం వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ పరంగా అప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. పెద్దల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు బాగున్నాయి.  ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. కీలకమైన వ్యవహారాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం కాదు.  ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ప్రతిరోజు కూడా తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు గ్రీన్

ధనస్సు:    ధనస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. రావలసిన బెనిఫిట్స్ అందుతాయి. స్థలం కానీ నూతన గృహం కానీ కొనుగోలు చేస్తారు. వ్యాపార రీత్యా ఒక కొత్త ప్రాజెక్టుని ప్రారంభించాలని అనుకుంటారు. ఉద్యోగం మారాలని మీ కోరిక నెరవేరుతుంది. ఈ రాశి వారికి అర్థాష్టమ శని నడుస్తుంది 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. నూతన పెట్టుబడును పెట్టడానికి అనువైన కాలం కాదు. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు తెలుపు.

మకరం:   మకర రాశి వారికి ఈ  వారం  అంతగా అనుకూలంగా లేదు. వ్యాపారంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది తక్కువగా ఉంటుంది నష్టాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. ఉద్యోగం మారాలనుకునేవారు కొంతకాలం వేచి ఉండండి. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. చిట్ ఫండ్స్ కి షేర్ మార్కెట్ కి దూరంగా ఉండండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు పోటీ పరీక్షలలో పాల్గొంటారు.. విదేశాలలో ఉండి చదువు కోవాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చేసరికి నాలుగు కలిసివచ్చే రంగు లైట్ ఎల్లో.

కుంభం:      కుంభ రాశి వారికి ఈ వారం  మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలకు రంగా మీరు అనుకున్న స్థాయిని చేరుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధి కూడా బాగుంటుంది. వెన్నునొప్పి ఇబ్బంది పెడుతుంది. గోచార రీత్యా  మీరు వచ్చిన అవకాశాలను చేజార్చుకునే పరిస్థితి గోచరిస్తుంది. విద్యార్థినీ విద్యార్థులకు విద్య పైన శ్రద్ధ కలుగుతుంది. సంతానం యొక్క క్రమశిక్షణ లోపిస్తుంది. సంతాన పరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. వివాహం కానివారు వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ప్రేమ వివాహాలు వివాదాస్పదం అవుతాయి. నూతన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి. ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.

మీనం: మీన రాశి వారికి ఈ వారం  మీన రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. గురు గ్రహ అనుకూలత లేకపోవడం వల్ల చేసిన పనిని రెండుసార్లు చేయవలసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ఆలస్యంగా నైనా సరే మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు బాగున్నాయి. అన్ని నాకే తెలుసు అన్న ధోరణిని పక్కన పెట్టండి. హోమ్ లోన్ సంబంధించిన విషయంలో క్రెడిట్ కార్డులకు సంబంధించిన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్య ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా అరటి నారా వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.

Telugu weekly rasi phalalu

Telugu weekly rasi phalalu

Telugu weekly rasi phalalu

Rasi phalalu cheppandi

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News