Sunday, June 22, 2025

చిత్రీకరణ చివరి దశలో..

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా రాజా సాబ్.(Raja Saab) ప్రభాస్ కెరీర్‌లోనే మొదటిసారిగా హార్రర్ థ్రిల్లర్ కామెడీ జానర్‌లో చేస్తున్న సినిమా ఇది. వాస్తవానికైతే రాజా సాబ్ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవాల్సింది కానీ మధ్యలో ప్రభాస్ కాలికి గాయం అవడంతో షూటింగ్ ఆగిపోయింది. దీంతో సినిమా ఆలస్యమైంది. ప్రభాస్ పూర్తిగా కోలుకుని ఇప్పుడు షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం రాజా సాబ్ సినిమా షూటింగ్ 95 శాతం పూర్తయినట్టు తెలిసింది. త్వరలోనే ఆ మిగిలిన భాగం షూటింగ్ కూడా పూర్తి కానుంది. ఈ విషయాన్ని స్వయంగా రాజా సాబ్ నిర్మాత టి.జి విశ్వప్రసాద్ తెలిపారు. రాజా సాబ్ సినిమా షూటింగ్ 95 శాతం పూర్తయిందని, మూడు పాటలు, చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉందని ఆయన చెప్పారు.

రాజా సాబ్ లోని వీఎఫ్‌ఎక్స్ (VFX World class) ప్రపంచ స్థాయిలో ఉంటుందని, సినిమాలో 3డీ సీజీతో సహా అన్ని రకాల సీజీలు ఉంటాయని ఆయన వెల్లడించారు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న రాజా సాబ్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇండియాలోనే ఏ సినిమాకూ వేయనంత పెద్ద సెట్ లో ఈ హార్రర్ ఫాంటసీని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు మారుతి. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటిస్తుండగా, సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News