Sunday, June 22, 2025

కుబేర పెద్ద సూపర్ హిట్

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న కాంబినేషన్‌లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘కుబేర’. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎస్‌విసిఎల్‌ఎల్‌పిపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్‌తో నిర్మించారు. కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ “కుబేర సినిమాలో నాది బ్యూటిఫుల్ క్యారెక్టర్. నాకు ఎప్పటినుంచో ఒక కొత్త క్యారెక్టర్ చేయాలని ఉండేది.

శేఖర్ సినిమాలన్నీ చూశాను. ఆయన క్యారెక్టర్ కి అద్భుతంగా న్యాయం చేస్తారు. ఈ కథ వినగానే నాది మెయిన్ కరెక్ట్ అనిపించింది. ప్రతి పాత్ర కూడా నేను చేసిన దీపక్ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది. ఈ కథ వినగానే ఇది దీపక్ కథ అనిపించింది. శేఖర్ కూడా దీన్ని అలానే చెప్పా రు. నా క్యారెక్టర్‌కి వచ్చిన స్పందన గొప్ప ఆనందాన్నిచ్చింది. మిస్సమ్మ మాయాబజార్, గుండమ్మ కథ ఈ సినిమా అన్నిట్లో కూడా హీరో ఎవరని చెప్పలేం. అందులో కథ హీరో. అవన్నీ కూడా డైరెక్టర్ ఫిలిమ్స్. (Director Films) కుబేర కూడా అవుట్ అండ్ అవుట్ శేఖర్ కమ్ముల ఫిలిం”అని అన్నారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ “ఈ సినిమా కథ పుట్టినప్పటినుంచి చాలా డిఫరెంట్‌గా చేద్దాం, హాలీవుడ్ స్థాయి లో తీద్దాం, రియల్ లొకేషన్స్ లో చేద్దాం, ముంబయ్‌ని కొత్తగా చూపిద్దామని ఆశ కలిగింది.

నాగార్జున దగ్గరికి అదే ఆశతో వెళ్ళా ము. చాలా డిఫరెంట్‌గా తీద్దామని అని ఆయనకి చెప్పాను. ఆయనకి చాలా నచ్చింది. ఆ యన ఈ సినిమాలో అద్భుతంగా చేశారు. ఇది సామాన్యమైన సినిమా కాదు. సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా అని ప్రీ రీలీజ్ ఈవెంట్‌లో చెప్పాను. అది ఈరోజు నిజమైంది. నేను చేసిన సినిమాల్లో ఇది గొప్ప సినిమా”అని తెలిపారు. నిర్మాత సునీల్ నా రంగ్ మాట్లాడుతూ “కుబేర పెద్ద సూపర్ హిట్. సినిమా పట్ల చాలా ఆనందంగా ఉన్నాం. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని కథ విన్నప్పుడే చెప్పాను. శేఖర్ కమ్ముల గ్రేట్ డైరెక్టర్. భవిష్యత్తులో కూడా ఆయన అ న్ని సూపర్ హిట్ సినిమాలు తీస్తారు. నాగార్జునకి ధన్యవాదాలు. ఆయన సపోర్ట్‌తోనే సినిమాని అనుకున్న సమయంలో రిలీజ్ చేయగలిగాం”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత పుస్కుర్ రామ్ మోహన్ రావు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News