Sunday, June 22, 2025

ఫ్యాన్స్‌కి విజయ్ బర్త్‌డే ట్రీట్.. ‘జన నాయగన్’ ఫస్ట్ రోర్

- Advertisement -
- Advertisement -

తమిళ స్టార్ హీరో విజయ్‌ గత ఏడాది ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. అయితే విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం అనే రాజకీయ పార్టీని ఆయన స్థాపించారు. ఈ నేపథ్యంలో ఆయన సినిమాలకు దూరం అవుతారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan). ఇదే ఆయన చివరి చిత్రం అని కూడా ప్రచారం జరుగుతోంది. ఆదివారం ఈ సినిమా గ్లింప్స్‌ని ‘ఫస్ట్ రోర్’ పేరుతో విడుదల చేశారు.

ఈ గ్లింప్స్‌లో విజయ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కనిపించారు. ‘నిజమైన నాయకుడు అధికారం కోసం కాదు.. ప్రజల కోసం పుట్టుకొస్తాడు’ అని వీడియోలో పేర్కొన్నారు. ఇక హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో (Jana Nayagan) పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాశ్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News