వినూత్న కథలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్న గుణ శేఖర్ రూపొందిస్తోన్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘యుఫోరియా’. సమకాలీన అంశాలతో, లేట్‌నైట్ కల్చర్, డ్రగ్స్, యువత అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని గుణ శేఖర్ తెరకెక్కిస్తున్నారు. రిలీజ్‌కు సిద్ధమవుతోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఫ్లై హై సాంగ్‌తో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ నుంచి ‘రామ రామ..’ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భూమిక, విఘ్నేష్ గవిరెడ్డి, రోహిత్, డైరెక్టర్ గుణశేఖర్, నీలిమ గుణ, ఎడిటర్ ప్రవీణ్ పూడి, ఆదిత్య మ్యూజిక్ మాధవ్, మాస్టర్ ఆరుష్, యానీ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా… చిత్ర దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ “నాతో పాటు రాగిణి, నీలిమ, యుక్త కలిసి ‘యుఫోరియా’ సినిమాను తీశారు.
కుటుంబ సమేతంగా చూసేలా ఈ సినిమాను తెరకెక్కించాం. అందరూ కనెక్ట్ అయ్యేలా ఆహ్లాదకరంగా చక్కటి మెసేజ్‌తో సినిమాను తెరకెక్కించాం. ఫ్లై హై అనే పాటతో ( song Fly High) అందరినీ మెప్పించిన కాల భైరవ ఇప్పుడు రామ రామ అనే సాంగ్‌తో మన ముందుకు వచ్చారు. చైతన్య ప్రసాద్ ఈ పాటకు మంచి సాహిత్యాన్ని అందించారు. అందరూ ఎంజాయ్ చేసేలా పాట ఉంటుంది’ అని అన్నారు. నటి భూమిక మాట్లాడుతూ “యుఫోరియా’ నా హృదయానికి ఎంతో దగ్గరైన సినిమా. నాకు పదకొండేళ్ల కొడుకున్నాడు. విఘ్నేస్‌తో ఎక్కువగా సెట్స్‌లో ఉన్నప్పుడు మా అబ్బాయితో ఉన్నట్లే అనిపించింది.
తను ఎంతో గొప్పగా నటించాడు. ఆ మూవీ నుంచి విడుదలైన రామ రమ సాంగ్ ఎంతో నచ్చింది. కాల భైరవ మంచి సంగీతాన్ని అందించారు’ అని తెలిపారు. నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ “యుఫోరియా’ నుంచి రిలీజైన రామ రామ సాంగ్ చూస్తుంటే నాకు ఒక్కడు సినిమాలో చెప్పవే చిరుగాలి సాంగ్‌లో ఆమెను చూసినట్లే అనిపించింది. ఆమె ఈ సినిమాలో నటించటం ఎంతో గొప్పగా భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ పూడి, విఘ్నేశ్, రోహిత్ పాల్గొన్నారు. గుణ హ్యాండ్‌మేడ్ ఫిలమ్స్ పతాకంపై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాగిణి గుణ సమర్పిస్తున్నారు.