Monday, June 23, 2025

జానపద ఊపుతో నిండిన పాట

- Advertisement -
- Advertisement -

క్వీన్ అనుష్క శెట్టి.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన మూవీ ‘ఘాటి’ గ్లింప్స్‌లో ఇంటెన్స్ వయోలెంట్ క్యారెక్టర్‌లో అందరినీ ఆశ్చర్యపరిచారు. తమిళ స్టార్ విక్రమ్ ప్రభు ఇంటెన్స్ అవతార్‌లో కనిపించిన క్యారెక్టర్ గ్లింప్స్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. ఘాటిని యువి క్రియేషన్స్ సమర్పిస్తోంది. రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ఘాటి జూలై 11న రిలీజ్ కానుంది. మేకర్స్ తాజాగా జానపద ఊపుతో నిండిన పాట ‘సైలోరే‘ సాంగ్‌ని విడుదల చేశారు. ఇది ఓ ఎనర్జిటిక్ బ్లాస్టర్‌లా ఉంది. ప్రకృతిసౌందర్యంతో నిండిన అడవులను నేపథ్యంగా చేసుకున్న ఈ ఫోక్ వెడ్డింగ్ యాంథమ్‌లో లీడ్ పెయిర్ ఉత్సవంగా కనిపించి ప్రేక్షకులను అలరించారు.

అనుష్క, విక్రమ్ కొత్తగా పెళ్లి అయిన జంటగా సంగీతం, నృత్యం, సాంస్కృతిక వెలుగులతో చుట్టూ ఉంటూ అడవిని రంగుల విందుగా, మేళా తాళాలతో, భావోద్వేగాలతో నింపారు. నాగవెళ్లి విద్యాసాగర్ స్వరపరిచిన ఈ మనసును తాకే పాట జానపదపు స్వరాలను (Folk voices) భావోద్వేగాలకు మిళితం చేస్తూ అద్భుతంగా వుంది. కృష్ణ రాసిన సాహిత్యం హుషారు వుంది. లిప్సిక భాష్యం, సాగర్ నాగవెళ్లి, సోనీ కోమండూరి ఆలపించిన ఈ పాట ఉత్సవాన్ని మరింత పెంచింది. రాజు సుందరం కోరోయోగ్రఫీ అద్భుతంగా వుంది. ఘాటి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీగా విడుదల అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News