Sunday, July 13, 2025

ఇరాన్ విలవిల

- Advertisement -
- Advertisement -

అత్యంత కీలక ఐఆర్‌జి ప్రధాన కార్యాలయం, ఎవిన్
జైలుపై ఇజ్రాయెల్ దాడులు ఫోర్డో అణుస్థావరంపై
మరోసారి ప్రతాపం రహదారులపైనా
క్షిపణుల వర్షం ప్రభుత్వ ఆఫీసులను లక్షంగా
ఎంచుకున్న టెల్ అవీవ్ ఎదురుదాడులతో
ప్రతిఘటించిన ఇరాన్ తమ అణు కార్యక్రమం
ఆగబోదని ప్రకటన రష్యా సాయం కోరిన ఇరాన్

దుబాయ్/టెహ్రాన్/టెల్‌అవీవ్:పశ్చిమాసియాలో పోరు మ రింత భీకర రూపం దాల్చింది.అమెరికా నుంచి తీవ్రస్థా యి దాడులు చవిచూసిన ఇరాన్‌పై మరుసటి రోజు ఇజ్రాయెల్ ముప్పేట దాడులతో మరింత చితికిపోయింది. అ యితే ఎదురుదాడులతో ఇజ్రాయెల్‌ను ప్రతిఘటించింది. అత్యంత వ్యూహాత్మకంగా ఇజ్రాయెల్ సోమవారం ఇరాన్ సైన్యం ఇ రానియన్ రెవెల్యూషనరీ గార్డు (ఐఆర్‌జి) ప్రధాన కార్యాలయంపై బాంబులతో విరుచుకుపడింది. మరో వైపు ఇరాన్‌లోని అత్యంత కీలకమైన ఎవిన్ ప్రిజన్‌ను ధ్వంసం చేసింది. పూర్తి సమన్వయంతో ఇరాన్‌లో కనీసం ఆరువరకూ విమానాశ్రయాలపై వైమానిక దాడులకు దిగినట్లు ఇజ్రాయెల్ సైన్యం అధికారికంగా ప్రకటించింది. ఇరాన్‌కు చెందిన ప్ర ధాన వైమానిక స్థావరాలను, సైనిక వ్యవస్థలను కూడా ఈ వైమానిక దాడుల దశలో ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ డి ఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్) ప్రకటించింది. ఇరాన్‌ను ఏ విధంగా కూడా తేరుకోకుండా చేస్తూ తమకు అందే విశ్వసనీయ గూఢాచార సమాచారం ప్రాతిపదికన నిర్ణీత సైనిక స్థావరాలను లక్షంగా చేసుకునే దాడులకు పాల్పడుతోంది.

సాధ్యమైనంత వరకూ పౌర సముదాయాలను దెబ్బతీయకుండా దాడులు సాగించాలనే ఆదేశాలను ఐడిఎఫ్ జాగ్రత్తగా అమ లు చేస్తోంది. తమ దేశ అంతిమ లక్షం కేవలం ఇరాన్ అ ణు పాటవ విధ్వంసం, సైనిక శక్తిని ధ్వంసం చేయడం అని చాటుకునేలా ఇజ్రాయెల్ వ్యవహరిస్తోంది. రన్‌వేలు, భూగ ర్భ బంకర్లను దెబ్బతీస్తూ, ఓ ఇంధన భర్తీ విమానంపై దాడు లు సాగించి ఇజ్రాయెల్ తన పోరు ఉధృతం చేసింది. ఇరాన్ సైన్యానికి చెందిన పలు ఎఫ్ 14 ఎస్, ఎఫ్ 5 ఎస్, ఎహెచ్ 1 ఫైటర్లు, హెలికాప్టర్లను లక్షంగా చేసుకుని దాడులకు ది గింది. సోమవారం టెహ్రాన్‌లోని పలు నిర్ణీత కేంద్రాలపై ఇ జ్రాయెల్ డ్రోన్లు, క్షిపణులు భారీ స్థాయిలో విధ్వంసం కల్గించాయి. అమెరికా ఆపరేషన్‌లో దెబ్బతిన్న ఇరాన్ ప్రధాన అ ణు స్థావరం ఫోర్డో పునరుద్ధరణకు ఇరాన్ అధికార యం త్రాంగం చేస్తున్న ప్రయత్నాలను ఇజ్రాయెల్ నిరోధించింది. ఈ స్థావరానికి వెళ్లే రాదారులను పనికిరాకుండా చేసింది. ఇరాన్ తన రాజకీయ ప్రత్యర్థులను ఉంచి చిత్రహింసలకు గురి చేసే ఎవిన్ జైలుపై కూడా దాడికి దిగామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ జైలు దుష్టచర్యల చిత్రహింసల వేదిక అని మండిపడింది. ఈ జైలు ఏ స్థాయిలో దెబ్బతిన్నదనేది వెల్లడికాలేదు. ఇజ్రాయెల్‌లో దాడులకు ప్రతిఫలంగా ఇక ఇరాన్ నియంతను శిక్షించే ఘట్టం ఆసన్నమైందని హెచ్చరించారు.

మేమేం చేయాలో అదే చేస్తాం: ఇరాన్
పర్వతాల కింద ఉన్న ఈ స్థావరం తిరిగి యధావిధిగా పనిచేసేందుకు అన్ని ప్రయత్నాలు సాగించామని ఇరాన్ ప్రకటించింది. తమ దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న విధంగా యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని సజావుగా సాగిస్తుందని , దెబ్బతిన్న అణు కేంద్రాలను తిరిగి పనిచేయిస్తామని ఇరాన్ ప్రకటించింది. మరో వైపు ఇజ్రాయెల్‌లోని కొన్ని ప్రాంతాలను ఎంచుకుని ఇరాన్ సేనలు దాడులకు దిగాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు సాగించినా తమ అణు కార్యక్రమం ఆగబోదని ఇరాన్ విదేశాంగ మంత్రి మజిద్ తక్త్ రవాంచీ సోమవారం ప్రకటించారు. విదేశీ శక్తులు ఇరాన్ అది చేయాలి , ఇది చేయాలని ఆదేశిస్తే భయపడేది లేదని, తాము ఎంచుకున్న విధానాలలోనే సాగుతామని ఆయన తెలిపారు

. ఇరాన్ తాజాగా ఇజ్రాయెల్‌పై ట్రూ ప్రామిస్ 3 పేరిట సైనిక చర్యకు దిగిందని సైనిక వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్ నగరాలు హఫియా, టెల్ అవీవ్‌పై దాడులు జరిగాయి. జెరూసలెం వద్ద కూడా పేల్లుళ్లు జరిగాయి. అయితే ఆయా ప్రాంతాలలో ఏ మేరకు నష్టం వాటిల్లిందనేది వెల్లడికాలేదు. ఇరాన్‌పై దాడితో అమెరికా తనకు తాను ఇరకాటంలోకి నెట్టుకుందని ఇరాన్ సైనిక దళాల జనరల్ అబ్దోలరహిమ్ మౌసవి తెలిపారు. ఇప్పుడు తాము అమెరికా సైనిక ప్రయోజనాలు, ఆ దేశ సైన్యాన్ని దెబ్బతీసేందుకు చర్యలకు దిగేందుకు వీలేర్పడిందని వ్యాఖ్యానించారు. ఇరాన్ క్షిపణుల దాడి పరిధిలోనే ఇప్పుడు లక్షలాది అమెరికా సేనలు పశ్చిమాసియాలోని పలు స్థావరాలలో ఉన్నారని ఆర్మీ జనరల్ చెప్పారు. కాగా ఇజ్రాయెల్‌లోని దక్షిణ ప్రాంతంలోని పలు విద్యుత్ కేంద్రాలపై ఇరాన్ క్షిపణుల దాడులతో అంధకారం అలుముకుందని వెల్లడైంది.

ఫోర్డో అణు కేంద్రం, బాసిజ్ ఐఆర్‌జిపై బాంబుల దాడి
ఇరాన్ సైన్యం రెవెల్యూషనరీ గార్డ్ (ఐఆర్‌జి) ప్రధాన కార్యాలయంపై దాడిని ఇజ్రాయెల్ అత్యంత కీలక విజయంగా పేర్కొంది. ఇరాన్ సైన్యానికి ఇది ప్రధాన సంచాలక భవనం . ఇది బాగా దెబ్బతిందని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. అమెరికా దాడులలో దెబ్బతిన్న ఫోర్డో అణు కేంద్రంపై కూడా ఇజ్రాయెల్ దాడులకు దిగింది. అక్కడ అణు కార్యక్రమాల పునరుద్ధరణ జరుగకుండా విధ్వంసానికి పాల్పడింది. ఇక ఐఆర్‌జికి చెందిన కమాండ్ సెంటర్లు, ఆస్తులను , అంతర్గత భద్రతా బలగాలను దెబ్బతీశారు. ఈ హెడ్‌క్వార్టర్‌ను బాసిజ్ హెడ్‌క్వార్టర్‌గా పిలుస్తారు. ఇది ఇరాన్ సైన్యం కేంద్రీకృత కమాండ్ కంట్రోలు కేంద్రంగా ఉంది. దేశంలో ఇస్లామిక చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు , పౌరుల నుంచి తలెత్తే ఉల్లంఘనలను పాలకులకు నివేదించి బహిరంగంగా శిక్షించేందుకు ఇక్కడ తగు ఏర్పాట్లు ఉన్నాయి.

ఇజ్రాయెల్ దాడులో అల్‌బార్జ్ సైనిక దళం, తహర్ అల్లాహ్ కమాండ్ సెంటర్, సయీవ్ అల్ షుహదా దళాల విభాగాన్ని ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అంతర్గత భద్రతను పర్యవేక్షించే ఇంటలిజెన్స్ కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేశారు. ఎవిన్ ప్రిజన్ ఇతర చోట్ల జరిగిన దాడుల వీడియోలను ఇరాన్ విదేశాంగ మంత్రి గిడియన్ సార్ వెలువరించారు. ఈ వీడియోల దృశ్య మాలికకు స్వేచ్ఛ విలసిల్లాలి అనే శీర్షిక పెట్టారు. ప్రిజన్‌పై జరిగిన దాడిని ఇరాన్ ప్రభుత్వ అనుబంధ సంస్థ మిజాన్ కూడా నిర్థారించింది. జైలులోని ఖైదీలు ఇతరులు సురక్షితంగా ఉన్నారని వివరించారు. జైలు ప్రవేశద్వారం దెబ్బ తిన్న దృశ్యాలతో కూడిన ఫోటోలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ స్థావరానికి వెళ్లే రాదారులను పనికిరాకుండా చేసింది. ఇరాన్ తన రాజకీయ ప్రత్యర్థులను ఉంచి చిత్రహింసలకు గురి చేసే ఎవిన్ జైలుపై కూడా దాడికి దిగామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ జైలు దుష్టచర్యల చిత్రహింసల వేదిక అని మండిపడింది. ఈ జైలు ఏ స్థాయిలో దెబ్బతిన్నదనేది వెల్లడికాలేదు. ఇజ్రాయెల్‌లో దాడులకు ప్రతిఫలంగా ఇక ఇరాన్ నియంతను శిక్షించే ఘట్టం ఆసన్నమైందని హెచ్చరించారు.

మేమేం చేయాలో అదే చేస్తాం : ఇరాన్
పర్వతాల కింద ఉన్న ఈ స్థావరం తిరిగి యధావిధిగా పనిచేసేందుకు అన్ని ప్రయత్నాలు సాగించామని ఇరాన్ ప్రకటించింది. తమ దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న విధంగా యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని సజావుగా సాగిస్తుందని , దెబ్బతిన్న అణు కేంద్రాలను తిరిగి పనిచేయిస్తామని ఇరాన్ ప్రకటించింది. మరో వైపు ఇజ్రాయెల్‌లోని కొన్ని ప్రాంతాలను ఎంచుకుని ఇరాన్ సేనలు దాడులకు దిగాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు సాగించినా తమ అణు కార్యక్రమం ఆగబోదని ఇరాన్ విదేశాంగ మంత్రి మజిద్ తక్త్ రవాంచీ సోమవారం ప్రకటించారు. విదేశీ శక్తులు ఇరాన్ అది చేయాలి , ఇది చేయాలని ఆదేశిస్తే భయపడేది లేదని, తాము ఎంచుకున్న విధానాలలోనే సాగుతామని ఆయన తెలిపారు.

ఇరాన్ తాజాగా ఇజ్రాయెల్‌పై ట్రూ ప్రామిస్ 3 పేరిట సైనిక చర్యకు దిగిందని సైనిక వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్ నగరాలు హఫియా, టెల్ అవీవ్‌పై దాడులు జరిగాయి. జెరూసలెం వద్ద కూడా పేల్లుళ్లు జరిగాయి. అయితే ఆయా ప్రాంతాలలో ఏ మేరకు నష్టం వాటిల్లిందనేది వెల్లడికాలేదు. ఇరాన్‌పై దాడితో అమెరికా తనకు తాను ఇరకాటంలోకి నెట్టుకుందని ఇరాన్ సైనిక దళాల జనరల్ అబ్దోలరహిమ్ మౌసవి తెలిపారు. ఇప్పుడు తాము అమెరికా సైనిక ప్రయోజనాలు, ఆ దేశ సైన్యాన్ని దెబ్బతీసేందుకు చర్యలకు దిగేందుకు వీలేర్పడిందని వ్యాఖ్యానించారు. ఇరాన్ క్షిపణుల దాడి పరిధిలోనే ఇప్పుడు లక్షలాది అమెరికా సేనలు పశ్చిమాసియాలోని పలు స్థావరాలలో ఉన్నారని ఆర్మీ జనరల్ చెప్పారు. కాగా ఇజ్రాయెల్‌లోని దక్షిణ ప్రాంతంలోని పలు విద్యుత్ కేంద్రాలపై ఇరాన్ క్షిపణుల దాడులతో అంధకారం అలుముకుందని వెల్లడైంది.

ఫోర్డో అణు కేంద్రం, బాసిజ్ ఐఆర్‌జిపై బాంబుల దాడి .
ఇరాన్ సైన్యం రెవెల్యూషనరీ గార్డ్ (ఐఆర్‌జి) ప్రధాన కార్యాలయంపై దాడిని ఇజ్రాయెల్ అత్యంత కీలక విజయంగా పేర్కొంది. ఇరాన్ సైన్యానికి ఇది ప్రధాన సంచాలక భవనం . ఇది బాగా దెబ్బతిందని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. అమెరికా దాడులలో దెబ్బతిన్న ఫోర్డో అణు కేంద్రంపై కూడా ఇజ్రాయెల్ దాడులకు దిగింది. అక్కడ అణు కార్యక్రమాల పునరుద్ధరణ జరుగకుండా విధ్వంసానికి పాల్పడింది. ఇక ఐఆర్‌జికి చెందిన కమాండ్ సెంటర్లు, ఆస్తులను , అంతర్గత భద్రతా బలగాలను దెబ్బతీశారు. ఈ హెడ్‌క్వార్టర్‌ను బాసిజ్ హెడ్‌క్వార్టర్‌గా పిలుస్తారు. ఇది ఇరాన్ సైన్యం కేంద్రీకృత కమాండ్ కంట్రోలు కేంద్రంగా ఉంది. దేశంలో ఇస్లామిక చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు , పౌరుల నుంచి తలెత్తే ఉల్లంఘనలను పాలకులకు నివేదించి బహిరంగంగా శిక్షించేందుకు ఇక్కడ తగు ఏర్పాట్లు ఉన్నాయి.

ఇజ్రాయెల్ దాడులో అల్‌బార్జ్ సైనిక దళం, తహర్ అల్లాహ్ కమాండ్ సెంటర్, సయీవ్ అల్ షుహదా దళాల విభాగాన్ని ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అంతర్గత భద్రతను పర్యవేక్షించే ఇంటలిజెన్స్ కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేశారు. ఎవిన్ ప్రిజన్ ఇతర చోట్ల జరిగిన దాడుల వీడియోలను ఇరాన్ విదేశాంగ మంత్రి గిడియన్ సార్ వెలువరించారు. ఈ వీడియోల దృశ్య మాలికకు స్వేచ్ఛ విలసిల్లాలి అనే శీర్షిక పెట్టారు. ప్రిజన్‌పై జరిగిన దాడిని ఇరాన్ ప్రభుత్వ అనుబంధ సంస్థ మిజాన్ కూడా నిర్థారించింది. జైలులోని ఖైదీలు ఇతరులు సురక్షితంగా ఉన్నారని వివరించారు. జైలు ప్రవేశద్వారం దెబ్బ తిన్న దృశ్యాలతో కూడిన ఫోటోలు ప్రచారంలోకి వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News