ఖతార్, కువైట్,ఇరాక్, బహ్రెయిన్‌లో స్థావరాలపై క్షిపణి దాడులు దోహా ఎయిర్‌బేస్‌పై ఆరు
మిస్సైళ్లతో విరుచుకుపడ్డ టెహ్రాన్, పలు చోట్ల పేలుళ్ల శబ్ధాలు అడ్డుకునేందుకు సర్వశక్తులు
ఒడ్డిన ఖతార్ సిచ్యుయేషన్ రూమ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యప్రాచ్యంలో
పరిస్థితులపై సమీక్ష ఇరాన్ దాడుల నేపథ్యంలో పలు దేశాల గగనతలాలు మూసివేత
ఎయిరిండియా విమానాల దారి మళ్లింపు, పలు సర్వీసులు రద్దు
టెహ్రాన్ : గల్ఫ్ దేశం దోహాలోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ భీకర దాడికి దిగింది. ఆ రు క్షిపణులతో ఖతార్‌లోని పలు అమెరికా స్థావరాలను ఎంచుకుని దాడి జరిపింది. ఖతార్ రా జధాని అయిన దోహా బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా 24 గంటల్లో పలు ప్రాంతాల్లోని అమెరికా సైనిక స్థావరాలు ఇతర కేంద్రాలపై దాడులకు దిగుతామని ఇరాన్ సోమవారం హెచ్చరించింది. వెనువెంటనే ఖతార్పైకి దాడులకు పాల్పడింది. ఆపరేషన్బేషరతు ఫతా పేరిట ఈ దాడి నిర్వహించింది. వరుసగా సాగిన ఆరుక్షిపణి దాడులతో ప్రస్తుత పశ్చిమాసియా యుద్ధం మరిన్ని ప్రాంతాలకు విస్తరించే ముప్పు ఏర్పడింది.
ఇరాన్ బెదిరింపుల నేపథ్యంలో ముందుగానే దోహా తమ గగనతలం నుంచి విమానాల రాకపోకలను నిలిపివేసింది. దీనితో పలు అంతర్జాతీయ విమానాలకు బ్రేక్‌లు పడ్డాయి. దోహా శివార్లలోని అల్ ఉడెడ్ వైమానిక స్థావరం వద్ద 10000 మంది అమెరికా సైనికులు ఉంటారు. దీనిని యుఎస్ సెంట్కామ్ స్థావరంగా వ్యవహరిస్తారు. ఇక్కడ బ్రిటిష్ సైన్యం కూడా విధుల్లో ఉంటుంది. ఖతార్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ దాడిపై వెంటనే ప్రెసిడెంట్ ట్రంప్ స్పందించారు. వైట్‌హౌస్‌లోని ప్రత్యేక సిట్యుయేషన్ రూంలో రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, సైనికాధికారులు, ఉన్నత స్థాయి సలహాదార్లతో భేటీ అయ్యారు. అమెరికా తీవ్రస్థాయి అతిక్రమణలకు పాల్పడినందున తాము సాగించే ప్రతీకార దాడులు ఆరంభమయ్యాయని
ఇరాన్ అధికారిక టీవీ ప్రకటించింది.
దోహాపై దాడుల గురించి ఇరాన్ జాతీయ భద్రతా మండలి ప్రకటన వెలువరించింది. తమ దేశంపై అమెరికా ఆరు క్షిపణులను ప్రయోగించినందున తాము కూడా ఇదే సంఖ్యలో మిస్సైల్స్ వాడినట్లు తెలిపారు. ఖతార్ రాజధాని దోహా మీదుగానే అమెరికా ఇతర దేశాలకు పలు విమానాలు వెళ్లుతాయి. గల్ఫ్ ప్రాంతంలోని విమానాల ప్రయాణ కూడలి కేంద్రంగా దోహాకు పేరుంది. ఇరాన్ ప్రతీకార దాడుల తరువాత దోహాలో హై అలర్ట్ ప్రకటించారు. స్కూళ్లు, కార్యాలయాలు మూసివేశారు. ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రజలు తదుపరి సమాచారం వరకూ ఇండ్లలోనే ఉండాలని మైక్‌లలో సందేశాలు వెలువరించారు. ఖతార్‌తో పాటు ఇరాక్, ఉక్రెయిన్ ఇతర ప్రాంతాలలో కూడా అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులకు దిగినట్లు వెల్లడైంది. వీటి వివరాలు వెల్లడికాలేదు. ఇరాక్‌లోని ఐన్ అల్ అసాద్లో ఉన్న అమెరికా ఎయిర్‌బేస్ వద్ద ఉన్న వైమానిక రక్షణ వ్యవస్థను రక్షించుకునేందుకు అమెరికా రక్షణ వర్గాలు చర్యలు చేపట్టాయి. ఈ మేరకు వైట్‌హౌస్ ప్రకటన వెలువరించింది.