- Advertisement -
చెన్నై: ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు తమిళనాడు మంత్రి శేఖర్‌బాబు సవాల్ విసిరారు. 2026 ఎన్నికల్లో చెన్నై నుంచి పోటీ చేసే దమ్ముందా అని పవన్ కు ఛాలెంజ్ చేశారు. చెన్నైలోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయాలని, తమిళనాడు ఎన్నికల్లో పవన్ గెలిచి చూపించాలన్నారు. గెలిచిన తర్వాత పవన్ ఎన్నిచెప్పినా వినడానికి సిద్ధంగా ఉన్నామని శేఖర్‌బాబు స్పష్టం చేశారు. అసలు తమిళనాడుతో ఎపి ఉప ముఖ్యమంత్రి ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. మమ్మల్ని ప్రశ్నించడానికి ఆయన ఎవరు అని శేఖర్‌బాబు మండిపడ్డారు. బిజెపి మాయలో మత రాజకీయాలను ప్రోత్సహించవద్దని హెచ్చరించారు. దేవదాయశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, పవన్ మాటలు నమ్మడానికి తమిళ ప్రజలు సిద్దంగా లేరని శేఖర్‌బాబు చురకలంటించారు.
- Advertisement -