- Advertisement -
ఫ్యూచర్ బ్రైట్ ఫిలిమ్స్ పతాకంపై హరిప్రసాద్ కోనే, ఇషాని గోష్ హీరో హీరోయిన్లుగా చైతన్య కొండా దర్శకత్వంలో గంగాధర్ పెద్ద కొండ నిర్మించిన ఎమోషనల్ ఎంటర్టైనర్ హ్యాపీ జర్నీ. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ను (First look poster) కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకులు చైతన్య కొండ, నిర్మాత గంగాధర్ పెద్ద కొండ, అరుణ్ కుమార్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ “ఇలాంటి మంచి సినిమా చేసిన డైరెక్టర్ని అభినందిస్తున్నాను. హిందీ, తెలుగు భాషలలో విడుదల కానున్న ఇలాంటి సినిమాలకు నేను ఎంతవరకైనా సహకరిస్తాను”అని అన్నారు.
- Advertisement -