Wednesday, June 25, 2025

హార్దిక్ పాండ్యాతో డేటింగ్.. ఎట్టకేలకు మౌనం వీడిన హీరోయిన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో డేటింగ్ పై ఎట్టకేలకు హీరోయిన్ ఈషా గుప్తా మౌనం వీడింది. పాండ్యాతో డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటి ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈషా మాట్లాడుతూ.. హార్ధిక్ తో రిలేషన్ షిప్ పై వస్తున్న పుకార్లను తోసిపుచ్చారు. “అవును, కొంతకాలం మేము మాట్లాడుకున్నాం. మేము డేటింగ్ చేశామని నేను అనుకోను. మేము రెండు నెలలుగా మాట్లాడుకున్నాం..వ్యక్తిగతంగా ఒకటి, రెండు సార్లు కలిశాం. కానీ, మేము డేటింగ్ దశకు చేరుకోకముందే అది ముగిసింది” అని వెల్లడించింది. ఇక, 2019లో కాఫీ విత్ కరణ్ షోలో హార్దిక్ పాండ్యా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై కూడా ఈషా స్పందిస్తూ.. అది నన్ను ప్రభావితం చేయలేదని, ఎందుకంటే అప్పటికే తాము మాట్లాడటం మానేశామని చెప్పింది. ఈ విషయంపై తాను చెప్పడానికి ఇంకేమీ లేదని ఆమె పేర్కొంది. కాగా, ఈ వివాదం సమయంలో పాండ్యాను బహిరంగంగా విమర్శించిన కొద్దిమంది ప్రముఖులలో ఈషా గుప్తా కూడా ఉన్నారు.

ఇదిలావుంటే.. ఈషా చివరిసారిగా MX ప్లేయర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘ఆశ్రమ్’లో బాబీ డియోల్, చందన్ రాయ్ సన్యాల్, అదితి సుధీర్ పోహంకర్ లతో కలిసి కీలక పాత్రల్లో కనిపించింది. తన నెక్ట్స్ ప్రాజెక్టు.. ధ్వని గౌతమ్ దర్శకత్వం వహించిన ‘భాయ్ భాయ్’లో సోనియా రథీ, హితేన్ పటేల్ లతో కలిసి ప్రధాన పాత్రల్లో కనిపించనుంది రాజ్ 3 నటి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News