Tuesday, July 8, 2025

అంతరిక్షంలోకి దూసుకెళ్లిన శుభాన్షు శుక్లా

- Advertisement -
- Advertisement -

అంతరిక్షానికి చేరుకున్న రెండో
భారతీయుడిగా రికార్డు
సృష్టించిన శుభాంశు శుక్లా
ఆయనతోపాటు మరో ముగ్గురిని
కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి
అంతరిక్షానికి మోసుకెళ్లిన ఫాల్కన్-9
రాకెట్ యాక్సియం-4 మిషన్‌లో
భాగంగా గగనతీరాలకు చేరిన
వ్యోమగాములు 41ఏళ్ల తరువాత
అద్భుతం ఆవిష్కృతం 28గంటల
ప్రయాణం అనంతరం అంతర్జాతీయ
అంతరిక్ష కేంద్రానికి చేరుకోనున్న
శుభాంశు శుక్లా బృందం ఐఎస్‌ఎస్
చేరుకున్న తొలి భారతీయుడిగా
మరో రికార్డు సొంతం చేసుకోనున్న
శుక్లా 14రోజులు ఐఎస్‌ఎస్‌లో
పరిశోధనలు

భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా, ఆక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి విజయవంతంగా దూసుకెళ్లారు, మరో చరిత్ర సృష్టించారు. శుభాన్షు కక్ష్యకు చేరుకున్న రెండవ భారతీయుడు , అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి ప్రయాణించిన మొదటి భారతీయుడు అయ్యారు. ఈ ప్రయోగం బుధవారం, జూన్ 25, 2025న ఫ్లోరిడాలోని
నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక ద్వారా జరిగింది. ఆక్సియం-4 మిషన్ ఒక ప్రైవేట్ అంతరిక్ష విమాన వెంచర్. శుక్లాతో పాటు మరో ముగ్గురు అంతర్జాతీయ వ్యోమగాములు అంతరిక్షంలో చేరారు.శుభాన్షు అంతరిక్షయాత్ర భారతదేశ అంతరిక్ష కార్యక్రమంలో ఓ ముఖ్యమైన ఘట్టం. 41 సంవత్సరాల తర్వాత ఒ భారతీయుడు అంతరిక్షంలోకి ప్రయాణించడం ఇదే మొదటిసారి. 1984లో భారత వైమానిక దళ అధికారి, స్వాడ్రాన్ లీడర్ రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి దూసుకెళ్లిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. కజకిస్తాన్ నుంచి సోవియెట్ అంతరిక్ష నౌకలో
సోయెజ్ -టి-11 అంతరిక్ష నౌకద్వారా అంతరిక్షంలోకి దూసుకెళ్లిన భారతీయుడు అయ్యాడు.

నాలుగు దశాబ్దాల తర్వాత మరో అద్భుతం ఇది.శుభాన్షు శుక్లా కక్ష్యలోకి దూసుకెళ్లడం ద్వారా భారత అంతరిక్షచరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. అలాగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం( ఐఎస్ ఎస్ ) ప్రయోగాలు చేస్తున్న మొదటి భారతీయపౌరుడిగా రికార్డులకు ఎక్కాడు, రాకేశ్ శర్మ చారిత్రాత్మక అంతరిక్షయాత్ర జరిగిన తర్వాత ఒక సంవత్సరానికి 1985లో జన్మించిన శుక్లా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కెప్టెన్, ప్రస్తుతం వ్యోమగామి. ఆక్సియమ్ స్పేస్ యాక్స్ -4 మిషన్లో భాగంగా ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి స్పేస్ ఎక్స్ డ్రాగన్ అంతరిక్షనౌకను ప్రయోగించారు. బుధవారం ఫాల్కన్ -9 లోని మెర్లిన్ ఇంజన్లు నిప్పులు చిమ్ముకుంటూ స్పేస్ ఎక్స్డ్రాగాన్ ను ఎర్త్ ఆర్బిట్ లోకి తీసుకెళ్లింది. నిర్దేశించిన ఖచ్చితత్వంతో ఫాల్కన్-9 డ్రాగన్ ను కక్ష్యలో ప్రవేశపెట్టింది. రెండోదశలో డ్రాగన్ మరింత ముందుకు దూసుకెళ్లి అంతరిక్ష ప్రయోగశాల వైపు సాగింది. ప్రయోగం ప్రారంభం కావడానికి ఓ గంటముందు శుక్లా, ఇతర వ్యోమగాములు తమతమ కుటుంబ సభ్యులకు వీడ్కోలు పలికారు.

శుక్లా భార్య,పిల్లలు కూడా శుభాకాంక్షలు చెప్పారు.విఘ్నాలతో ఆలస్యమైన అంతరిక్ష ప్రయాణం కొన్ని విఘ్నాల కారణఁగా మే 28నే జరగాల్సిన ఈ ప్రయోగం ఆలస్యం అయింది. సాంకేతిక లోపాలు,ఫాల్కన్ -9, డ్రాగన్ అంతరిక్ష నౌక, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వాతావరణ పరిస్థితులు, ఇలా ఎన్నో కారణాల వల్ల జాప్యం జరిగింది. నలుగురు వ్యోమగాములు దాదాపు నెల్లాళ్లపాటు నిర్బంధంలో ఉండాల్సివచ్చింది. స్పెస్ ఎక్స్, ఆక్సియమ్, నాసా, ఇస్రో నిపుణులు లోపలన్నింటినీ విజయవంతంగా చక్కదిద్దారు. ఎట్టకేలకు బుధవారంనాడు విజయవంతంగా ప్రయోగం జరిగింది. అంతరిక్ష ప్రయాణంలో విఘ్నాలు ఓ భాగం, మిషన్ ఆలస్యం అయినా యాక్స్-4 సిబ్బంది ఉత్సాహంగా అంతరిక్ష కేంద్రానికి సురక్షితమైన,విజయవంతమైన ప్రయాణంకోసం ఎదురు చూశారని మిషన్ కమాండర్ పెగ్లి విట్సన్ తెలిపారు.ఎఎక్స్ – సిబ్బందితో డ్రాగన్ అంతరిక్ష నౌక ప్రస్తుతం భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని కలిసేందుకు నిర్దేశించిన భూ కక్ష్యలో తిరుగుతోంది.మిశన్ పైలట్ అయిన శుక్లా అంతరిక్ష కేంద్రానికి సాగుతున్న ప్రయాణాన్ని పరిశీలిస్తారు. గతంలో మిగ్ -21, మిగ్ -29, డోర్నియర్, ఎఎన్- 32, సుఖోయ్ -30వంటి పలు విమానాల టెస్ట్ పైలెట్
అయిన శుక్లా డ్రాగాన్ అంతరిక్ష నౌక పైలట్ గా కీలకపాత్ర వహిస్తున్నారు.

అంతరిక్ష యాత్రలో శుభాన్షు శుక్లా సహచరులు
భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లాను ఆయన అంతరిక్ష సహచరులు షుక్స్ అని వ్యవహరిస్తారు.శుక్లాతో పాటు ఎఎక్స్- 4 మిషన్ కు నాయకత్వం వహిస్తున్న అమెరికన్ వ్యోమగామి డాక్టర్ పెగ్గీ విట్సన్.అంతరిక్షంలో 675 రోజులు గడిపిన అనుభవజ్ఞుడు ఉన్నారు. మిగతా ఇద్దరు మిశన్ నిపుణులు పోలెండ్ కు చెందిన సవోస్జ్ ఉజ్నాన్స్కీ, హంగేరికి చెందిన
టిబోర్ కాపు. డ్రాగన్ మిషన్లు 1,000 కంటే ఎక్కువ సైన్స్, పరిశోధన ప్రాజెక్టులను ప్రారంభించాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో శుభాన్షు శుక్లా భారతీయ శాస్త్రవేత్తలు రూపొందించిన ఏడు అత్యాధునిక ప్రయోగాలను నిర్వహిస్తారు. సుక్ష్మ గురుత్వాకర్షణ( మైక్రో గ్రావిటీలో) జీవశాస్త్రం, ఆహారం, వైద్యం, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ప్రయోగాలు నిర్వహిస్తారు.

ఇది నాంది
‘ప్రియమైన దేశవాసులారా!
నమస్కారం. ఎంత
అద్భుతమైన ప్రయాణమిది! 41 ఏళ్ల తర్వాత మనం మళ్లీ
అంతరిక్షంలోకి
అడుగుపెట్టాం.
నా భుజాలపై ఉన్న మువ్వన్నెల జెండాను చూస్తుంటే మీరంతా నాతోనే ఉన్నారన్న భావన
కలుగుతోంది. ఇది కేవలం
అంతర్జాతీయ అంతరిక్ష
కేంద్రానికి వెళ్తున్న ప్రయాణం మాత్రమే కాదు. భారత మానవ సహిత అంతరిక్ష యాత్రకు నాంది. ఈ ప్రయాణంలో మీరంతా
భాగస్వాములు కావాలి. గర్వంతో మీ ఛాతీని ఉప్పొంగనీయండి. మనమంతా కలసి భారతదేశ మానవ అంతరిక్ష కార్యక్రమాన్ని
ఆరంభిద్దాం. జైహింద్..
జైభారత్!

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News