Sunday, August 10, 2025

అడవి మార్గాన డోలీతో ఆరు కిలోమీటర్లు నడక

- Advertisement -
- Advertisement -

రహదారులు సరిగా లేక వలస ఆదివాసీలు దుర్భర జీవితాలు గడపాల్సి వస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం, పద్మాపురం పంచాయతీ పరిధి వలస ఆదివాసి గ్రామమైన నీలాద్రిపేటకు చెందిన మడవి మంగమ్మకు వాంతులు, విరేచనాలు కావడంతో ఆరోగ్యం విషమించింది. కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించగా నీలాద్రిపేటకు రహదారి సరిగా లేకపోవడంతో మోతె సమీపంలో వాహనం నిలిపామని అక్కడికి తీసుకురావాలని సూచించారు. దీంతో మంగమ్మ భర్త జోగయ్య తన సమీప బంధువులతో ఆమెను జట్టి (డోలి) కట్టి అడవి మార్గాన సుమారు 6 కిలోమీటర్లు కాలిబాటన వచ్చి మోతె సమీపంలో 108 వాహనంలో ఎక్కించుకొని మణుగూరు ఏరియా హాస్పిటల్ కి తీసుకువెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News