గ్వానాజువాట: మెక్సికోలో కాల్పులు కలకలం సృష్టించాయి. గ్వానాజువాట ప్రాంతం ఇరాపువాటోలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు తెగపడడంతో 12 మంది మృతి చెందారు. 20 మంది గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరా లప్రకారం… సెయింట్ జాన్ బాప్టిస్ట్ చర్చిలో స్ట్రీట్ ఫెస్టివల్‌లో భాగంగా డ్రమ్స్ వాయిస్తూ, డ్యాన్స్‌లు చేస్తుండగా ఓ గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరపడంతో 12 మంది చనిపోగా 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనను మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బాయ్ తీవ్రంగా ఖండించారు. మృతులకు సంతాపం తెలపగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకలించారు. ఇది దురదృష్టకరమైన సంఘటన అని దర్యాప్తు చేస్తామన్నారు. మే నెలలో గ్వానాజువాటో ప్రాంతం శాన్ బార్టోలో డి బెరియోస్లోలో దుండగులు కాల్పులు జరపడంతో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. గత సంవత్సరం నుంచి తుపాకీ తుటాలకు వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.