డైనమిక్ హీరో విష్ణు మంచు (Vishnu Manchu)డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న విడుదల కాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో బుధవారం నాడు శివ బాలాజీ మీడియాతో మాట్లాడుతూ “ఈ సినిమాలో మహదేవశాస్త్రి కొడుకు పాత్రకు నేను అయితే బాగుంటుందని అనుకున్నారు. అలా కన్నప్ప చిత్రంలోకి వచ్చేశాను. ‘కన్నప్ప’ చిత్రంలో నా పాత్ర నిడివి, ప్రాముఖ్యత కాస్త తక్కువగానే ఉంటుంది. కానీ ఓ గొప్ప చిత్రం, పాన్ ఇండియన్ చిత్రంలో భాగం అవ్వాలనే ఉద్దేశంతో ఇంకేమీ ఆలోచించలేదు. న్యూజిలాండ్‌లో మొత్తం రెండు నెలలు ఉన్నాను.
మోహన్ బాబు షూటింగ్ చేసినన్ని రోజులు నేను కూడా షూట్ చేశాను. ‘కన్నప్ప’ సినిమాను నేను చూశాను. అద్భుతంగా వచ్చింది. మరీ ముఖ్యంగా సెకండాఫ్‌లో ప్రభాస్ ఎంట్రీ తరువాత రేంజ్ మారుతుంది. ప్రభాస్, విష్ణు పాత్రల మధ్య వచ్చే సంభాషణలు అద్భుతంగా అనిపిస్తాయి. మోహన్‌లాల్ ఎంట్రీ అందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అక్షయ్ కుమార్ క్యారెక్టర్ సర్ప్రైజింగ్గా (Surprisingly) అనిపిస్తుంది. మోహన్ బాబు ఆన్ స్క్రీన్ వేరుగా ఉంటారు.. ఆఫ్ స్క్రీన్ వేరుగా ఉంటారు. ‘కన్నప్ప’ సినిమాలో శివుడిగా అక్షయ్ కుమార్ అద్భుతంగా నటించారు. ఫస్ట్ డే ఆయన్ను షూట్లో చూసినప్పుడు షాక్ అనిపించింది. మనకు తెరపై ఆయన కనిపించే ఫస్ట్ సీన్‌కు మనం శివుడు అని ఫిక్స్ అయిపోతాం. అంతలా ఆ పాత్రలో ఆయన ప్రేక్షకుల్ని మెప్పిస్తారు. ఇక ప్రస్తుతం నేను మోహన్ బాబు పొడక్షన్లో హీరోగా ఓ సినిమా చేస్తున్నాను. రెక్కీ 2 కూడా త్వరలోనే రానుంది”అని అన్నారు.