రాజ్ గురు బ్యానర్‌పై రాజా దారపునేని నిర్మాతగా దయానంద్ గడ్డం రచనా దర్శకత్వంలో జూన్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం వర్జిన్ బాయ్స్. (Virgin boys) ఈ చిత్రంలో మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదలైన దం దిగా దం పాటకు ప్రణవ్ చాగంటి లిరిక్స్ అందించగా యాసిర్ నిసర్ తన స్వరాన్ని అందించారు. ఈ సందర్భంగా వర్జిన్ చిత్ర నిర్మాత రాజా దారపనేని మాట్లాడుతూ… “వర్జిన్ బాయ్స్ చిత్రం టీజర్, ఒక పాటకు మంచి స్పందన లభించింది.
సినిమా యూత్‌ఫుల్‌గా (Movie Youthful) ఉండబోతుంది. చిత్రంలో ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది”అని అన్నారు. చిత్ర దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ… “యూత్‌ఫుల్‌గా ఉండే ఈ సినిమా చూసినంతసేపు కాలేజీ రోజులు గుర్తొస్తాయి. చిత్రానికి మంచి సంగీతాన్ని అందించిన స్మరణ్ సాయికి ప్రత్యేక ధన్యవాదాలు”అని తెలిపారు. మిత్ర శర్మ మాట్లాడుతూ… వర్జిన్ బాయ్స్ చిత్రం ద్వారా నటిగా పూర్తిగా సంతృప్తి చెందానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెన్నీఫర్ ఇమాన్యుల్, శ్రీహాన్, గీతానంద్ తదితరులు పాల్గొన్నారు.