Friday, June 27, 2025

శుక్రవారం రాశి ఫలాలు (27-06-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆర్థికపరమైన అంశాలు ఏ దారిన పోతున్నాయో ఊహించడం మీకు కష్ట సాధ్యంగా పరిణమిస్తుంది. మీ స్థాయి పరపతి పెంపొందుతాయి. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.

వృషభం –  అన్నింట అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఒకరికి నూతన ఆదాయ మార్గం లభించే సూచన. విదేశాల నుండి విలువైన సమాచారాన్ని అందుకుంటారు.

మిథునం – వ్యాపార విస్తరణకు గాను మీరు చేసే కృషి ఫలిస్తుంది. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. మనీ రొటేషన్ స్కీమ్స్ లో సభ్యత్వాన్ని తీసుకుంటారు. ఎలర్జీ వంటి ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది.

కర్కాటకం – ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సంస్థాపరంగా తీసుకునే నిర్ణయాలలో తొందరపాటు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అభివృద్ధి మీరు ఆశించిన విధంగా ఉంటుంది.

సింహం – చెల్లింపులను సకాలంలో చెల్లించ గలుగుతారు. సంతానానికి సంబంధించిన విషయాలలో బంధువుల సహాయ సహకారాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

కన్య –  కుటుంబ ఖర్చులు, వ్యక్తిగతమైన ఖర్చులు ఎక్కువ అవుతాయి. అందుకు తగ్గట్టుగానే ఆదాయం కూడా పెరుగుతుంది. మీకు మీరుగా కొన్ని కఠినమైన బాధ్యతల నుండి తప్పుకుంటారు.

తుల – ఆత్మసాక్షి కి విలువనిచ్చి మున్ముందుకు సాగిపోతారు. మీ కష్టం వలన కార్యాలయంలో మీ సహ ఉద్యోగులకు కూడా ఉద్యోగ పరంగా మేలు జరుగుతుంది. మీరు నమ్మిన సన్నిహితుల పనితీరు మీకునచ్చదు

వ్యశ్చికం – భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. మీలోని ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి.  పనులు నిదానంగా పూర్తి చేస్తారు. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు.

ధనుస్సు – వృత్తి ఉద్యోగాలపరంగా పోటీదారులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ప్రతిస్పందించడం మంచిది కాదని గ్రహించండి.

మకరం – ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త వలన సంతోషం కలుగుతుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

కుంభం – ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానంనకు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు.

మీనం – పట్టుదలతో ముందుకు సాగుతారు. మీ వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకుంటారు.  సేవా కార్య క్రమాలలో పాల్గొంటారు.  ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

Rasi phalalu cheppandi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News