Thursday, August 14, 2025

పంత్.. అంత మాత్రానికే పల్టీలు కొట్టి సంబరాలా?: అశ్విన్

- Advertisement -
- Advertisement -

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు భారత మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కీలక సూచన చేశాడు. క్రికెట్‌లో సెంచరీలు సాధించడం సర్వసాధారణమని, అంత మాత్రాన సంబరాల్లో మునిగి తేలడం సరికాదన్నాడు. టెస్టుల్లో శరీరం అలసిపోతుందని, శతకం చేసిన తర్వాత పల్టిలు కొట్టి సంబరాలు చేసుకోవడం మంచిది కాదన్నాడు. ఇలా చేసే సమయంలో గాయానికి గురయ్యే ప్రమాదం ఉందన్నాడు. సెంచరీని డబుల్ సెంచరీగా మలచుకునేందుకు ప్రయత్నించాలని సూచించాడు. తొలి టెస్టులో ఓడిన టీమిండియాకు ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ కీలకమే అని పేర్కొన్నాడు. రానున్న మ్యాచ్‌లకు భారత్ ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని అశ్విన్ కోరాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News