Monday, July 14, 2025

విషపూరిత ఆహారం తిని ఐదు పులులు మృతి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: విషపు ఆహారం తిని ఐదు పులులు మృతి చెందిన సంఘటన కర్నాటక రాష్ట్రం చామరాజనగర జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు, కర్నాటక, కేరళ సరిహద్దులోని మళేమహదేశ్వర వన్యధామం ప్రాంతంలో ఐదు పులులు చనిపోయాయి. గుర్తు తెలియని వ్యక్తులు విషపూరిత ఆహారం పెట్టడంతోనే పులులు మృతి చెందాయని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు అక్కడికి పులుల ఐదు కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన వాటి తల్లి పులి, నాలుగు కూనలు ఉన్నట్టు సమాచారం. మూడు రోజుల్లో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని కర్నాటక మంత్రి ఈశ్వర్ కండే అధికారులకు ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News