Sunday, July 6, 2025

రేవంత్ పై చర్యలు తీసుకున్న తరువాతే రాహుల్ బీహార్ కి రావాలి: ప్రశాంత్ కిషోర్

- Advertisement -
పాట్నా: బీహార్ ప్రజలను కించపరిచేలా మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చర్యలు తీసుకోవాలని జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ డిమాండ్ చేశారు. ఆ తరువాతే బీహార్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి రాహుల్ రావాలని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి  కెసిఆర్ బీహార్ అడ్వైసర్‌లను, అధికారులను పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీయించాడని, కూలీ పనులు చేయడం బీహార్ ప్రజల డిఎన్ఎలోనే ఉందని రేవంత్ రెడ్డి మాట్లాడారని గుర్తు చేశారు. ఇవాళ రాహుల్ గాంధీ ఏం మొహం పెట్టుకొని బీహార్‌లోకి వస్తున్నారని ప్రశ్నించారు.. బీహార్ ప్రజలను కించపరిచేలా మాట్లాడిన రేవంత్ రెడ్డిపై ముందు చర్యలు తీసుకున్న తరువాతే రాహుల్ గాంధీ బీహార్‌లో ఎన్నికల ప్రచారానికి రావాలని ప్రశాంత్ కిశోర్ విమర్శలు గుప్పించారు.
రాహుల్ ఢిల్లీలో ఉండి బీహార్ వాళ్ల జోకులు వేస్తున్నారని, బీహార్ కు వచ్చి ఉపన్యాసం ఇవ్వాలని ఎద్దేవా చేశారు. 1989లో అప్పటి దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ బీహార్ కు రూ.50000 కోట్లు కేటాయించారని, నిధులు మాత్రం ఖర్చు చేయలేదని దుయ్యబట్టారు. బీహార్ లో లోక్ సభ ఎన్నికలలో ప్రధాని మంత్రి మోడీ సక్సెస్ అయ్యారని తెలిపారు. బీహార్‌లో కుల ప్రాతిపదికన, మోడీ పేరుతో ప్రజలు ఓట్లు వేస్తారని పిఎం నరేంద్ర మోడీ అన్నారని, మోడీ కులానికి చెందిన ప్రజలు బీహార్‌లో ఎంత మంది ఉన్నారని ప్రశాంత్ కిశోర్ ప్రశ్నించారు. మోడీ కులానికి చెందిన వ్యక్తులు బీహార్‌లో లేనప్పుడు మోడీకి ఎలా ఓట్లు పడ్డాయని నిలదీశారు. 
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News