Saturday, June 28, 2025

జన్మతః పౌరసత్వంపై ఆంక్షలకు ఓకే

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : జన్మతః అమెరికా పౌరసత్వ హక్కు వివాదంలో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ పంతం నెగ్గనుంది. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడికి ఉండే అధికారాలను దేశ సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ విఫయంలో ట్రంప్ అధికారాల నిలిపివేతకు దిగువ న్యాయస్థానాల జడ్జిల తీర్పును సు ప్రీంకోర్టు పరిమితం చేసింది. అమెరికాలో జన్మించే నవజాత శిశువులకు స్వతహసిద్ధంగా తక్షణం అమెరికా పౌరసత్వం కల్పించే విధానం ఇప్పటివరకూ అమలులో ఉంది. అయితే ఇది కుదరదని  ట్రంప్ తమ రెండోసారి అధికార ఆరంభంలోనే ఆంక్షలకుదిగారు.

దీనిపై మూడు రాష్ట్రాలు కోర్టుకువెళ్లాయి. అక్కడ ట్రంప్ అధికారాలకు బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు 6:3 తీర్పుతో దిగువ కోర్టుల ఆంక్షలను పరిమితం చేసింది. అధికారిక నిర్ణయాల అమలు విషయాల పరిశీలన తరువాత ఈ జడ్జిల తీర్పును పరిమితం చేశారు ఇంజెక్షన్‌లను నిలిపివేయాలనే ట్రంప్ అధికార యంత్రాంగ అభ్యర్థనను ఆమోదించింది. ఈ పరిణామంతో ఇకపై ఆయా రాష్ట్రాలలో కూడా జన్మతః పౌరసత్వ హక్కు సంపూర్తి అమలు సాధ్యం కాదు. పలు ఇతర అంశాల పరిధిలోనే నదజాత శిశువులకు సిటిజన్‌షిప్ బై బర్త్ స్థాయి కల్పిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News