Saturday, June 28, 2025

విజయ్‌ని ముద్దు పేరుతో పిలిచిన రష్మిక.. అలా చేస్తానంటూ ప్రామిస్..

- Advertisement -
- Advertisement -

నేషనల్ క్రష్ రష్మిక (Rashmika Mandanna) ప్రస్తుతం ఇండిస్ట్రీలోనే బిజీ హీరోయిన్‌గా మారిపోయారు. అటు కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు కంటెంట్ ఉన్న సినిమాల్లో కూడా ఆమె నటిస్తున్నారు. తాజాగా ఆమె భారీ ప్రాజెక్టును ప్రకటించారు. ఈ చిత్రానికి ‘మైసా’ అనే టైటిల్‌ పెట్టారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రష్మిక గతంలో ఎప్పుడూ చూడని లుక్‌లో కనిపించారు. ఈ ఫస్ట్‌లుక్‌ చూసిన సెలబ్రిటీలు, అభిమానులు రష్మికను విష్ చేస్తూ.. సోషల్‌మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

ఈ క్రమంలో విజయ్ దేవరకొండ కూడా రష్మికకు (Rashmika Mandanna) తన విషెస్ తెలిపారు. ‘మైసా’ పోస్టర్‌ని షేర్ చేసిన విజయ్ ‘ఇది అద్భుతంగా ఉండనుంది’ అంటూ పేర్కొన్నారు. విజయ్ చేసిన ఈ పోస్ట్‌ని రష్మిక రీషేర్ చేశారు. ‘విజ్జూ.. ఈ సినిమాతో నిన్ను గర్వపడేలా చేస్తా’ అంటూ క్యాప్షన్ పెట్టారు. అయితే విజయ్‌ని రష్మిక ‘విజ్జూ’ అని పిలవడంతో ఈ జంట రిలేషన్‌షిప్ గురించి మళ్లీ చర్చ మొదలైంది. వీరిద్దరు కచ్చితంగా ప్రేమలో ఉన్నారని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వీరిద్దరు కలిసి ఒకే కారులో ప్రయాణించిన దృశ్యాలు వైరల్ అయిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News