Sunday, June 29, 2025

దగా క్యాలెండర్లతో నిరుద్యోగ యువతను మోసం చేశారు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిరుద్యోగ యువతకు ఇచ్చిన సాధనకు బిఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఛలో సచివాలయం కార్యక్రమానికి మద్దతివ్వాలని నిరుద్యోగ యువత కోరారు అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ ఎస్ పాలనలో 1.62 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని తెలియజేశారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. జాబ్ క్యాలెండర్ (Job calendar) ప్రకారం ఒక్క నోటిఫికేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు. దగా క్యాలెండర్లతో నిరుద్యోగ యువతను మోసం చేశారని, నోటిఫికేషన్లు వద్దని యువత ధర్నాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటించారని, బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పడతామని అన్నారు. కమీషన్లు రావని రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయడం లేదా? అని హరీష్ రావు ప్రశ్నల వర్షం
కురిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News