అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్ నెలకొంది. వైఎస్ఆర్సిపి నేత, మాజీ మంత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆదివారం ఉదయం తాడిపత్రిలోని తన నివాసానికి వచ్చారు. తాడిపత్రికి రావొద్దంటూ పెద్దారెడ్డిని అడుకునేందుకు జెసి ప్రభాకర్ రెడ్డి అనుచరులు ప్రయత్నించారు. వివిధ గ్రామాల నుంచి టిడిపి కార్యకర్తలు తాడిపత్రి రావడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పెద్దరెడ్డి ఇంటిని చుట్టుముట్టేందుకు వారు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మరో వైపు మున్సిపల్ చైర్మన్, మాజీ ఎంఎల్ఎ జెసి ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి పెద్దారెడ్డి ఇంటి వైపు బయలుదేరారు. వారిని కూడా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్దారెడ్డి ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు. పెద్దరెడ్డి ఇంటికి వైపు వస్తున్న టిడిపి కార్యకర్తలు, ప్రభాకర్ రెడ్డి అనుచరులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎపి అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఓడినా గెలిచినా ప్యాక్షనిజం చేస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనను తాడిపత్రికి రాకుండా టిడిపి కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. ఆదివారం పెద్దారెడ్డి అడ్డుకునేందుకు టిడిపి కార్యకర్తలు పెద్దఎత్తున ప్రయత్నం చేశారు. పెద్దారెడ్డి ఇంటిల్లో ఆయనను పోలీసులు అరెస్టు చేసి అనంతపురం తీసుకెళ్లినట్టు సమాచారం.
తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -