Monday, June 30, 2025

రాజమండ్రిలో కీలక సన్నివేశాలు

- Advertisement -
- Advertisement -

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా, మహేష్ బాబు పి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ’ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తాజా షూటింగ్ షెడ్యూల్ (Latest shooting schedule) ఆదివారం రాజమండ్రిలో ప్రారంభమైంది. రామ్ పోతినే, కన్నడ స్టార్ ఉపేంద్రలపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ఆసక్తికరమైన కథాంశంలో రామ్ డై హార్డ్ అభిమాని పాత్రను పోషిస్తుండగా, ఉపేంద్ర సూపర్ స్టార్ గా పాత్రలో కనిపిస్తారు. ఇటీవల విడుదలైన ’ఆంధ్రా కింగ్ తాలూకా’ టైటిల్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే రామ్ సరసన కథానాయికగా నటిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News