‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని, ముఖ్యంగా యువతను ఆకట్టుకుని సంచలన విజయం సాధించి కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. సినిమా రీరిలిజ్ మరింత ఆసక్తిని కలిగించింది. ఇప్పుడు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా సీక్వెల్ ను అధికారికంగా ప్రకటించారు. ‘ఈఎన్ఈ రిపీట్ ’ (ENE repeat) టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ యూత్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్తో మళ్ళీ అదరగొట్టబోతోందనే హామీ ఇస్తోంది. దాదాపు ఒరిజినల్ స్టార్ కాస్ట్, టెక్నికల్ టీంతో తిరిగి వస్తోంది ఈ సీక్వెల్. ఫస్ట్ పార్ట్‌లో (First part) అందరినీ అలరించిన గ్యాంగ్ విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను మరోసారి అలరించబోతున్నారు. తరుణ్ భాస్కర్ ఈ సీక్వెల్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ ఒరిజినల్స్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై డి. సురేష్ బాబు, సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మిస్తున్నారు.
క్రేజీ మూవీకి సీక్వెల్
- Advertisement -
- Advertisement -
- Advertisement -